Hail Storm | నిజామాబాద్‌లో వడగళ్ల వాన.. సిరిసిల్లలో తడిసిన ధాన్యం..!
Hail Storm | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లు కురిశాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో రాళ్ల వానపడింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే, కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ, దోమకొండ ప్రాంతాల్లో వర్షం కురువడంతో పంట నష్టం జరిగింది.
Hail Storm | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లు కురిశాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో రాళ్ల వానపడింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే, కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ, దోమకొండ ప్రాంతాల్లో వర్షం కురువడంతో పంట నష్టం జరిగింది. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల కోతకు వచ్చిన వరిపంటకు నష్టం కలిగింది. వరికల్లాల వద్ద ఆరబోయిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
అలాగే, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ వర్షం కురిసింది. రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగుపడింది. తాడి చెట్టు మంటల్లో కాలిపోయింది. ఆకాశం నుంచి నిప్పులు కురిసినట్టుగా పిడుగు పడటంతో తాడి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అలాగే, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. అలాగే, హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. రాబోయే అరగంట సమయంలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఎండలు దంచికొట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




