MLC Elections | నేటి నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ.. ఏర్పాట్లు చేస్తున్న రాజకీయ పార్టీలు
MLC Elections | రాష్ట్రంలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల (Graduates Constituencies) ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు (MLC Elections) జరగనున్నాయి.
MLC Elections | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల (Graduates Constituencies) ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు (MLC Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ (Voter Registration) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం, తాజాగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి.. డిగ్రీ పూర్తిచేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు (Graduate MLC Elections)ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. దీనికోసం ఫారం-18 నింపాల్సి ఉంటుంది. నవంబర్ 6 వరకు ఓటర్ల నమోదుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
గతంలో ఈ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్నవారైనా సరే, రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే కచ్చితంగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. పాత ఓటర్ల జాబితాను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అర్హులైన పట్టభద్రులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఫామ్-18 పూర్తి చేసి, ధ్రువీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ కాపీలను జతచేసి వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తి గల అర్హులు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా అవసరమైన విద్యా ధ్రువపత్రాలతో ఫారమ్-18ను పూర్తి చేసి స్థానిక ఎన్నికల అధికారుల (ఈఆర్‌వో లేదా డెసిగ్నేటెడ్ అధికారులు) వద్ద నేరుగా కూడా సమర్పించవచ్చు. పోస్టు ద్వారా కూడా ఫారమ్ పంపే అవకాశం కల్పించారు.
సంబంధిత వార్తలు

Vattikuti Ramarao Goud | ఎమ్మెల్సీ టికెట్ నాకే ఇవ్వండి.. మంత్రి ఉత్తమ్‌కు వట్టికూటి విజ్ఞప్తి
సెప్టెంబర్ 27, 2026

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
సెప్టెంబర్ 26, 2026

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Bank Employees Strike | వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా
- ●Horoscope | సెప్టెంబర్ 28 రాశిఫలాలు.. మీ రూపురేఖలు, వ్యక్తిత్వంపై శ్రద్ధ చూపుతారు!
- ●US Visitor Visa Hyderabad | అమెరికా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్
- ●Mobile Number Leak Signs | తరచూ స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? మీ ఫోన్ నంబర్ హ్యాక్ అయినట్టే.. సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి
- ●Medigadda Barrage Repair | మేడిగడ్డ బ్యారేజీకి ఎండ్ టు ఎండ్ డయాఫ్రం వాల్
- ●Festive Season Appliance Price Hike | పండక్కి ఆఫర్లా.. వాతలా? వినియోగదారులకు ఊహించని షాక్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు పైపైకి

Bank Employees Strike | వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

Horoscope | సెప్టెంబర్ 28 రాశిఫలాలు.. మీ రూపురేఖలు, వ్యక్తిత్వంపై శ్రద్ధ చూపుతారు!

US Visitor Visa Hyderabad | అమెరికా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్

Mobile Number Leak Signs | తరచూ స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? మీ ఫోన్ నంబర్ హ్యాక్ అయినట్టే.. సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి



