Mattapalli Temple | మట్టపల్లి క్షేత్రానికి పర్యాటక శోభ.. టూరిజం అభివృద్ధి, బోటింగ్ ఏర్పాటుకు నిధుల మంజూరు..
Mattapalli Temple | ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి (Mattapalli Temple) పర్యాటక కళ రానుంది. కృష్ణా నది తీరంలో వెలిసిన ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Mattapalli Temple | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి (Mattapalli Temple) పర్యాటక కళ రానుంది. కృష్ణా నది తీరంలో వెలిసిన ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మట్టపల్లి క్షేత్రంలో పర్యాటక వసతుల (Tourist Facilities) కల్పనతో పాటు, బోటింగ్ సౌకర్యాల (Boating Facility) ఏర్పాటు కోసం రూ.13 కోట్లు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) అధికారులు క్షేత్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేస్తు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నిధులతో మట్టపల్లి ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు, పర్యాటక మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు చేయనున్నారు. దీంతో రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పుడు కృష్ణా నదిలో బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుండటంతో, ఆధ్యాత్మిక యాత్రతో పాటు పర్యాటకులకు ఇదొక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మట్టపల్లి ప్రాంతంలో పర్యాటక రంగం మరింత పుంజుకోనుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హుజూర్‌నగర్ ప్రాంతంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ఆధ్యాత్మిక, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాగా, హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మట్టపల్లి క్షేత్ర అభివృద్ధికి పరిపాలనా అనుమతి లభించడం పట్ల స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే



