త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam | మిల్లర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తాం : మంత్రి ఉత్త‌మ్‌

Minister Uttam | రైస్‌ మిల్లర్ల సమ్మె నేపథ్యంలో వారి సమస్యలకు సానుకూల పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం.. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమైంది. పెనాల్టీలు, టెండర్‌ ధాన్యం ధరలు, స్టాక్‌ వ్యత్యాసాలు, సరఫరా గడువు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

P

Telangana | Published On Sep 18, 2026, 7.34 pm IST

Minister Uttam | మిల్లర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తాం : మంత్రి ఉత్త‌మ్‌
Advertisement

Minister Uttam | రైస్‌ మిల్లర్ల సమ్మె నేపథ్యంలో వారి సమస్యలకు సానుకూల పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం.. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమైంది. పెనాల్టీలు, టెండర్‌ ధాన్యం ధరలు, స్టాక్‌ వ్యత్యాసాలు, సరఫరా గడువు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మిల్లర్ల సమస్యలను నిబంధనల పరిధిలో సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్‌ తెలిపారు. మిల్లర్లను ప్రభుత్వం ప్రత్యర్థులుగా కాకుండా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్‌ వ్యవస్థలో భాగస్వాములుగా చూస్తోందన్నారు. రైతుల ప్రయోజనాలు, ప్రజాధన పరిరక్షణ, మిల్లింగ్‌ రంగం స్థిరత్వం మధ్య సమతుల్యతతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బ్యాంకుల నుంచి రుణాలు..

రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటోందని.. వాటిపై వడ్డీ భారం కూడా ఉంటుందని మంత్రి వివరించారు. రెండు నెలల క్రితం నిర్ణయించిన టెండర్‌ ధాన్యం ధరతో పోలిస్తే ఆ తర్వాత కూడా బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నందున ప్రభుత్వ వాస్తవ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడమే లక్ష్యమని.. మిల్లర్లపై అదనపు భారం మోపాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రస్తావించిన పెనాల్టీలు గత ప్రభుత్వ హయాంలో విధించినవేనని ఉత్తమ్‌ తెలిపారు. అయితే, పాత నిర్ణయాలంటూ సమస్యను పక్కన పెట్టబోమని.. పెనాల్టీలు, పెండింగ్‌ సరఫరాలు, స్టాక్‌ వ్యత్యాసాలు, వడ్డీ భారంపై సమగ్రంగా పరిశీలిస్తామని చెప్పారు. ఏడాది, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరఫరాల వల్ల పౌరసరఫరాల సంస్థపై పెరిగిన వడ్డీ భారాన్ని మిల్లర్లు కూడా అర్థం చేసుకోవాలని కోరారు.

నాలుగైదు రోజుల్లో మరో భేటీ

మిల్లర్లు సమ్మె విరమించి నాలుగైదు రోజుల సమయం ఇవ్వాలని ఉత్తమ్‌ కోరారు. ఈలోగా పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్ల వినతులు, ప్రభుత్వ వాస్తవ వ్యయం, నిబంధనల పరిధిలో పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం మిల్లర్ల ప్రతినిధులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే మిల్లర్ల ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement