Shiv Pratap Shukla | సేవే పరమ ధర్మం స్పూర్తితో సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Shiv Pratap Shukla | వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవాళికి సేవ చేయడానికి తీసుకునే పవిత్ర ప్రతిజ్ఞ అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. “సేవే పరమ ధర్మం” స్పూర్తితో ప్రజలకు వైద్యులు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు.
Shiv Pratap Shukla | వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవాళికి సేవ చేయడానికి తీసుకునే పవిత్ర ప్రతిజ్ఞ అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. “సేవే పరమ ధర్మం” స్పూర్తితో ప్రజలకు వైద్యులు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఉస్మానియా వైద్య కళాశాల 175వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్, పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉస్మానియా వైద్య కళాశాల అనేక దశాబ్దాలుగా దేశానికి నిబద్ధతతో కూడిన, నైపుణ్యవంతమైన వైద్యులను అందిస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థగా నిలిచిందని ఆయన కొనియాడారు.
వైద్య విద్యార్థులు సాధించిన విజయానికి వారి కఠోర శ్రమ, అంకితభావమే కారణమని గవర్నర్ అభినందించారు. ఆధునిక వైద్య రంగంలో సాంకేతికత, పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే మానవీయతను మరువకూడదని ఆయన సూచించారు. రోగి–వైద్యుల మధ్య నమ్మకమే అత్యంత విలువైన ఆస్తి అని తెలిపారు. ఈ సందర్భంగా పట్టభద్రుల కుటుంబ సభ్యులు, అధ్యాపకుల పాత్రను గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి మార్గదర్శకత్వం, త్యాగం వల్లే విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. యువ వైద్యులు గ్రామీణ సేవల నుంచి అత్యాధునిక వైద్య పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ నైతిక విలువలతో ముందుకు సాగాలని గవర్నర్ సూచించారు.
ఉస్మానియా మెడికల్ కళాశాల గొప్ప సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అంతకుముందు గవర్నర్ పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిశోర్, హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కే రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేందర్ కుమార్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజారావు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





