Gandrapalli | మూడు నెలల్లో 28 మంది మృతి.. ఊరు ఖాళీ చేసిన ప్రజలు
Gandrapalli | ఇటీవల కాలంలో ఆ గ్రామంలో వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లోనే మూడు పదుల మంది చనిపోయారు. దీంతో గ్రామంలో ఏదో జరుగుతుందని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Gandrapalli | త్రినేత్ర.న్యూస్: ఇటీవల కాలంలో ఆ గ్రామంలో వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లోనే మూడు పదుల మంది చనిపోయారు. దీంతో గ్రామంలో ఏదో జరుగుతుందని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏదో కీడు జరిగిందని భావించిన గ్రామ పెద్దలు.. ఊరు విడిచి వెళ్లాలలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి జనాలు సరేనన్నారు. ఒక రోజు ఉదయాన్నే అంతా కలసి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గండ్రపల్లిలో (Gandrapalli) జరిగింది.
గ్రామంలో వివిధ కారణాలతో గత మూడు నెలల్లో ఏకంగా 28 మంది మృతి చెందారు. వారిలో వృద్ధులే కాకుండా యువకులు కూడా ఉన్నారు. సాధారణంగా వయోభారంతో వృద్ధులు మరణిస్తూ ఉంటారు. కానీ యువకులు అర్థాంతరంగా చనిపోతుండటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గ్రామంలో ఏదో అరిష్టం దాగి ఉందని, అందుకే వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ మరణాల పరంపరకు ముగింపు పలకాలనుకున్న గ్రామ పెద్దలు.. పురోహితులను ఆశ్రయించారు. గ్రామ జాతకాన్ని పరిశీలించిన అతడు.. గ్రామానికి తీవ్రమైన కీడు సోకిందని, దానిని వదిలించుకోవాలంటే అందరూ కలిసి కీడు వంటలు నిర్వహించాలని సూచించారు.

దీంతో ఒక రోజు ముందుగానే గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. గురువారం తెల్లవారుజామునే గ్రామస్తులంతా తమ ఇండ్లకు తాళాలు వేసి, పిల్లాపాపలతో కలిసి గ్రామ పొలిమేరల వెలుపలికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా వంటలు చేసుకుని, దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామం ఒక్కసారిగా నిర్మాణుష్యంగా మారిపోయింది. అయితే గ్రామ ప్రజల నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ మరణాలకు గల అసలు కారణం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.
అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవరసం ఉంది. ప్రతిఒక్కరిని పరిశీలించి మరణాలకు గలకారణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. కలుషిత నీరు వల్లనా లేదా ఏదైనా అంటువ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయో తేల్చాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?





