త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TSCW | తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి

P

Telangana | Published On May 11, 2026, 6.53 pm IST

TSCW | తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి
Advertisement

TSCW | తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా గద్వాల విజయలక్ష్మి నియామ‌క‌మ‌య్యారు. చైర్‌ప‌ర్స‌న్‌తో పాటు ఆరుగురు స‌భ్యుల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్టారావు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. స‌భ్యులుగా కాసోజు శంక‌ర‌మ్మ‌, చిట్యాల శ్వేత‌, శ‌శిక‌ల యాద‌వ‌రెడ్డి, ఎస్ ల‌క్ష్మి, ఎన్ రాధాబాయ్‌, ఉజ్మా అశాయ్ షకీరాను నియ‌మించింది. గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే.

మొన్న‌టి వ‌ర‌కు మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్‌గా నేరెళ్ల శార‌ద ప‌ని చేశారు. ఇటీవ‌ల ప‌దవీకాలం ముగిసింది. ఆమె త‌న ప‌ద‌వీకాలాన్ని పొడ‌గించాల‌ని కోరారు. ప‌లువురు పార్టీ నేత‌లు ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇటీవల స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ భేటీలోనే విజ‌య‌ల‌క్ష్మి పేరును ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ప్ర‌భుత్వం ఆమెనే మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement