Vennela | తెలంగాణ మా అయ్యల జాగీరే.. ఇది త్యాగాల తెలంగాణ : గద్దర్ కూతురు వెన్నెల
Vennela | తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే... తెలంగాణ గడ్డ ఈ రోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల తేల్చిచెప్పారు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని ఆమె పేర్కొన్నారు.
Vennela | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే... తెలంగాణ గడ్డ ఈ రోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల తేల్చిచెప్పారు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఫైర్.. ఆమె మాటల్లోనే..
'ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. పవన్ అన్నగారు. మీరు ఒక నటుడిగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీరు మాట్లాడిన మాటలను ఒక తెలంగాణ ఆడబిడ్డగా కచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు. తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు. తెలంగాణ పైసలు పంచితే రాలేదు. తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవర్నీ ఒక బాధ పెట్టకుండా, ఎవర్నీ హింసించకుండా, తనకు తాను ఆహుతి చేసుకున్న శ్రీకాంతాచారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని, మాటలతోని గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ.
మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే నినాదంతో పల్లె పల్లె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాటగడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2 వేలకు పైగా అమరులయ్యారు. అది ఆన్ రికార్డు. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేశారు. కొందరు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలను కోల్పోయారు.
మీరన్నట్టే.. మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే.. ఈ రోజు మా జాగీరు.. రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే మా తెలంగాణ గడ్డనే మా త్యాగాల గడ్డనే' అని వెన్నెల స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు
- ●KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
- ●KTR | హరీశ్‌రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు

Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు





