Poison Food | గోవిందరావుపేటలో విషాదం.. కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేండ్ల బాలుడు మృతి
Poison Food | ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. కోతుల కోసం పెట్టిన విషాహారం (Poison Food) తీని నాలుగేండ్ల బాలుడు మృతిచెందాడు.
Poison Food | త్రినేత్ర.న్యూస్: ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. కోతుల కోసం పెట్టిన విషాహారం (Poison Food) తీని నాలుగేండ్ల బాలుడు మృతిచెందాడు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ ప్రజలను కోతుల బెడద వేధిస్తున్నది. దీంతో అంగన్‌వాడీ కేంద్రం పక్కనే ఉన్న పల్లె ప్రకృతివనంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ప్యాకెట్‌లో విషాహారం పెట్టారు.
అయితే కాలనీకి చెందిన బాలుడు అశ్విన్ నందన్ తన అక్క, స్నేహితులతో కలిసి పల్లె ప్రకృతి వనానికి వళ్లారు. అక్కడ వారికి ఆ ప్యాకెట్ కనిపించడంతో తీసుకుని నోట్లో వేసుకున్నారు. అయితే అది చేదుగా ఉండటంతో అశ్విన్ అక్క, స్నేహితులు వెంటనే దానిని ఉమ్మివేశారు. ఈలోగా నాలుగేండ్ల అశ్విన్ మాత్రం దానిని మింగేశాడు. మరికొంత తినాలనుకున్నప్పటికీ అక్క వద్దని చెప్పి.. వెంటనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు బాధితుడిని వెంటనే స్థానిక దవాఖానకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేదు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కోతుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



