త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farmers Dies | జ‌గిత్యాల జిల్లాలో విషాదం.. న‌లుగురు రైతులు మృతి

Farmers Dies | జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్ మండ‌లంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు రైతులు మృతి చెందారు.

S

Telangana | Published On Feb 3, 2026, 7.36 pm IST

Farmers Dies | జ‌గిత్యాల జిల్లాలో విషాదం.. న‌లుగురు రైతులు మృతి
Advertisement

Farmers Dies | త్రినేత్ర‌.న్యూస్ : జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్ మండ‌లంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు రైతులు మృతి చెందారు.

ప‌సుపు పంట కోత‌కు వెళ్లి రైతులు ట్రాక్ట‌ర్‌లో తిరిగి వ‌స్తుండ‌గా.. మొగిలిపేట గ్రామ శివారులో బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ట్రాక్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తున్న ప‌దిహేను మంది రైతుల్లో న‌లుగురు అక్క‌డికక్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మిగ‌తా రైతులు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల స‌హాయంతో క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement