FGG | ఉపాధ్యాయ సంఘాలను తగ్గించండి.. సీఎంకు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి
FGG | తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య విచ్చలవిడిగా పెరగడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని, సంఘాల కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తూ సంస్కరణలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
FGG | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య విచ్చలవిడిగా పెరగడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని, సంఘాల కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తూ సంస్కరణలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
లేఖలో భారత రాజ్యాంగంలోని అధికరణం 171 ప్రకారం ఉపాధ్యాయులకు ఇప్పటికే శాసనమండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించబడిన నేపథ్యంలో, వారి సమస్యలను ప్రస్తావించేందుకు అనేక ఉపాధ్యాయ సంఘాల అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 48 ఉపాధ్యాయ సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
సర్వీసు సంఘాల గుర్తింపు నియమాల ప్రకారం గుర్తింపు పొందే సంఘాలకు కనీసం 25 శాతం సభ్యత్వం ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ, ఉపాధ్యాయుల విషయంలో ఎనిమిది సంఘాలకు గుర్తింపు లభించగా, మరో 40 సంఘాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రధాన పదాధికారులకు బోధనా బాధ్యతలు, హాజరు నుంచి మినహాయింపులు ఇవ్వడం వల్ల పాఠశాలల్లో బోధనకు అంతరాయం కలుగుతోందని, సంఘాల సంఖ్య పెరిగే కొద్దీ తరగతి గదుల్లో బోధించే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనేక సంఘాలు రాజకీయ పార్టీలతో అనుబంధంగా ఉండడం వల్ల విద్యా వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే కులాల పేరుతో కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇది సర్వీసు సంఘాల గుర్తింపు నియమాలకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు వేతన పట్టికలో ఉన్నారని, వారిని అవసరానికి అనుగుణంగా సరైన పాఠశాలల్లో నియమిస్తే ఉపాధ్యాయుల కొరత సమస్య ఉండదన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల వేతనాలపై ప్రభుత్వం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
విద్య హక్కు చట్టం–2009 ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై నిర్దేశిత పాఠ్యాంశాన్ని పూర్తిగా బోధించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఈ నిబంధనలు సమర్థంగా అమలు కావడం లేదని ఫోరం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని, అనవసరంగా కొత్త సంఘాల ఏర్పాటును నియంత్రించాలని, అలాగే సంఘాల పదాధికారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను పునఃసమీక్షించి అత్యవసరమైన కొద్దిమందికే పరిమితం చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రిని కోరింది.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు



