Harish Rao | క్షుద్ర పూజల లొల్లి.. హరీశ్‌రావు ఏమన్నారంటే..?
Harish Rao | రాష్ట్రంలో వర్షాలు పడొద్దు.. కరువు సంభవించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్షుద్ర పూజల ఆరోపణలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో వర్షాలు పడొద్దు.. కరువు సంభవించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్షుద్ర పూజల ఆరోపణలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. టీవీ9 చానెల్‌తో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
హరీశ్‌రావు వ్యాఖ్యలు ఇలా..
రాజకీయాల్లో కూడా విమర్శలకు ఓ హద్దు పద్దు ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడి బట్ట కాల్చి మీద పడేస్తమంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవర్నీ వదిలిపెట్టేది లేదు. గతంలో కొండా సురేఖ కూడా అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ ఆవిడ నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రేపు వీళ్ల విషయంలో కూడా క్రిమినల్ సూట్, డిఫమేషన్ సూట్ కూడా వేస్తాను.. ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చాను.. 30 రోజుల గడువు ఉంది. 30 రోజులు ముగిసిన మరుసటి రోజు వారిపై క్రిమినల్, డిఫమేషన్ సూట్ వేస్తాను. వాళ్లను వదిలిపెట్టేది లేదు.. ఎందుకంటే ఒక హద్దు పద్దు ఉండాలి. విమర్శిస్తే దానికి ఆధారాలు ఉండాలి. నాలుక ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను, స్కామ్‌లను, ఫెయిల్యూర్స్‌ను ఎత్తిచూపుతున్న కాబట్టి నా మీద బురద జల్లాలని, డైవర్షన్ పాలిటిక్స్‌కు ప్రయత్నం చేస్తున్నారు. మైనింగ్ స్కాం, నాదర్‌గుల్ భూముల స్కాం బయటపెట్టాం. గురుకుల టెండర్లలో జరిగిన అవినీతి గురించి మాట్లాడినం. దేవాదులలో 10 మోటార్లు ఉంటే ఇవాళ కూడా 4 మోటార్లే నడుస్తున్నాయి.. ఇంకా ఆరు మోటార్లు నడవడం లేదు. ఇలా ఈ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతుంటే నన్ను టార్గెట్ చేసుకుని, కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత డైవర్షన్స్ చేసినా, ఎంత బురదజల్లాలని ప్రయత్నం చేసినా.. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీ స్కాంలను బయటపెడుతూనే ఉంటాను.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాను. రైతులు, విద్యార్థులు, మహిళల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
ఆగస్టు 13, 2026

Niranjan Reddy | కేసీఆర్ మీద కక్ష.. రైతు బీమా పథకం నిలిపివేత
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
- ●Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..
- ●Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ
- ●Supreme Court Electrocution Ruling | విద్యుత్ మరణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. బాధ్యత ఎవరిది?
- ●CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి

Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని

Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..

Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ



