త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఫార్ములా ఈ-కార్ కేసు.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

KTR | హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు గురువారం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా సమన్లు జారీ అయ్యాయి.

P

Telangana | Published On May 14, 2026, 6.35 pm IST

KTR | ఫార్ములా ఈ-కార్ కేసు.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
Advertisement

KTR | హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు గురువారం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏసీబీ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కోర్టు.. జులై 31న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా ఏసీబీ అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఏ1గా కేటీఆర్, ఏ2గా అర్వింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా ఎఫ్ఈవో (Formula E Operations) సంస్థ‌ను చేర్చారు. 2023లో విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగినట్లు కేసు కేసు న‌మోదు చేశారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి సుమారు రూ.55 కోట్లను ఎఫ్ఈవో సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు. ఈ చెల్లింపులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఫార్ములా ఈ-కార్ రేస్‌ను హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వ‌హించేందుకు అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఫార్ములా రేస్‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫార్ములా రేస్ కేసులో అక్ర‌మాలు జ‌రిగాయని ఆరోపిస్తూ ఏసీబీ విచార‌ణ‌కు ఆదేశించింది.

Advertisement
Advertisement