Harish Rao | మీ నినాదం ఉత్తమాటేనా? సాగునీటి మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ
Harish Rao | తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నినాదం ఉట్టిమాటేనా ఉత్తమ్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లపై గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తున్నదంటూ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన రైతులపక్షాన శనివారం లేఖ రాశారు.
Harish Rao | తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నినాదం ఉట్టిమాటేనా ఉత్తమ్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లపై గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తున్నదంటూ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన రైతులపక్షాన శనివారం లేఖ రాశారు. 2020 సంవత్సరం నుంచి 2023 వరకు ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తిచేసి సిద్దిపేట జిల్లాలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించుకోవడం జరిగిందన్నారు.
రిజర్వాయర్లను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నరు..
ప్రతీ యాసంగిలోనూ కాలువల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యాములు, నేరుగా ఆయకట్టు ద్వారా నీళ్లు అందించి రైతులకు ఎంతో మేలు చేశామని లేఖ ద్వారా మంత్రికి తెలిపారు. ఫలితంగా పంట దిగుబడి సైతం భారీగా పెరిగిందని, కానీ 2023 తర్వాత ఈ రిజర్వాయర్లను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతోందన్నారు. నేటికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 27 నెలల్లో ఒక్క గజం కాలువ తవ్వలేదన్నారు.. మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాల్సి ఉందని ఈ విషయంపై మీకు పలుమార్లు లేఖల రూపంలో, ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగానూ కలిసి వివరించానని లేఖలో పేర్కొన్నారు.
లక్ష ఎకరాల ఆయకట్టు పెరుగుతుంది..
కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం ప్రకారం "తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు" అనే పదం సిద్దిపేట జిల్లాలో సాధ్యమవుతుందన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్ ప్యాకేజ్-10కి సంబంధించి రూ.15 కోట్లు, రంగనాయకసాగర్ (ప్యాకేజీ-11) కొరకు రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ 30 కోట్లతో భూసేకరణ పూర్తయితే అదనంగా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు పెరుగుతుందని, మీ నిర్లక్ష్యం వలన కొత్త ఆయకట్టు ముందుకు సాగడం లేదన్నారు. మంత్రి నిర్ణయం కోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. వెంటనే కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టేందుకు రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



