త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Charminar Express | చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ప్ర‌యాణికులు క్షేమం

Charminar Express | హైదరాబాద్ నుంచి చెన్నె వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో (Charminar Express) భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ 5 (S5 coach) బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

G

Telangana | Published On Apr 26, 2026, 7.11 am IST

Charminar Express | చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ప్ర‌యాణికులు క్షేమం
Advertisement

Charminar Express | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్ నుంచి చెన్నె వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో (Charminar Express) భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ 5 (S5 coach) బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు, దట్టమైన పొగను గమనించి ప్ర‌యాణికులు భయంతో కేకలు వేస్తూ, గొలుసు లాగి కిందికి దూకారు. అప్ర‌మ‌త్త‌మైన‌ రైల్వే సిబ్బంది మంటలు ఇతర బోగీల‌కు వ్యాపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ప్ర‌యాణికుల‌ను దించివేయ‌డంతో పాటు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేశారు.

అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌క‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అయితే భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప‌లువురు ట్రైనులో నుంచి దూకేయ‌డంతో గాయ‌ప‌డ్డారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్న‌ది.

 

 

Advertisement
Advertisement