Female Techie Suicide | పీడకలల భయం.. అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో పరుగెత్తి చెరువులో దూకిన ఐటీ యువతి
Female Techie Suicide | హైదరాబాద్ మేడిపల్లిలో అర్ధరాత్రి వేళ నగ్నంగా పరుగెత్తుతూ ఐటీ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫీర్జాదిగూడ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది.
- దారిలో బీరప్ప గుడిలో చీర, విగ్రహం తీసుకెళ్లిన మృతురాలు
- సోషల్‌మీడియాలో సీసీ టీవీ దృశ్యాలు వైరల్
Female Techie Suicide | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మేడిపల్లిలో అర్ధరాత్రి వేళ నగ్నంగా పరుగెత్తుతూ ఐటీ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫీర్జాదిగూడ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు మార్గమధ్యలో ఉన్న బీరప్ప గుడిలో నుంచి విగ్రహం, చీర ఎత్తుకెళ్లడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.
పోలీసుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆరు నెలల క్రితమే జాబ్ వదిలేసి విశాఖపట్నంలోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. తిరిగి రెండు నెలల క్రితమే తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. ఫీర్జాదిగూడలోని శంకర్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మరోచోట అద్దె గది కోసం తళ్లీకూతుళ్లు కలిసి శుక్రవారం సాయంత్రం వరకు మియాపూర్‌లో వెతికారు. రాత్రి తిరిగి పీర్జాదిగూడకు వచ్చి పడుకున్నారు.
కాగా శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తేజస్విని నిద్రలేచింది. తల్లి ఉండే గదికి బయట నుంచి తాళం వేసింది. ఆ వెంటనే వీధుల్లోకి నగ్నంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. దారి మధ్యలో కనిపించిన బీరప్ప గుడి వద్ద ఆగి మొక్కుకుంది. అక్కడి నుంచి చీరతో పాటు విగ్రహం వెంట తీసుకెళ్లి ఫిర్జాదిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్రలేచిన తల్లి గది బయట తాళం వేసి ఉండటం గుర్తించి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు వచ్చి తెరవడంతో కుమార్తె కోసం ఎక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. చివరికి ఫీర్జాదిగూడ చెరువులో శవమై తేలింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె తరచూ పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అరుణ మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
అర్థరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆపై మృతి
హైదరాబాద్ పీర్జాదిగూడలో వెలుగు చుసిన షాకింగ్ ఘటన
విజయనగరం దేవుపల్లికి చెందిన తేజస్విని(25) అనే యువతి తన తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్లో ఉంటోంది
అర్థరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి.. నగ్నంగా… pic.twitter.com/LAwHuwWUPd
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 18, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
జులై 26, 2026

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
జులై 26, 2026

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
జులై 26, 2026
తాజావార్తలు
- ●Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
- ●Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం

Mann Ki Baat | అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

Servant Theft Cases | పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం వద్దు.. మనం ఇచ్చే అవకాశమే నేరానికి కారణం: వీసీ సజ్జనార్

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్



