త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarkurnool | కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తిరగబడ్డ రైతులు

Nagarkurnool | కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారంటూ.. రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో రేవంత్ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుందంటూ నిప్పులు చెరుగుతున్నారు.

S

Telangana | Published On Apr 24, 2026, 8.19 pm IST

Nagarkurnool | కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తిరగబడ్డ రైతులు
Advertisement

Nagarkurnool | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారంటూ.. రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో రేవంత్ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళ‌న‌కు దిగారు.

అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణలను రైతులు అడ్డుకుని నిల‌దీశారు. 15 రోజులుగా మా సమస్యలు కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు, యార్డుకు రాకుండానే వెళ్లిపోయారని రైతుల అసహనం వ్య‌క్తం చేశారు.

 

Advertisement
Advertisement