త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Faheem Qureshi | కౌశిక్‌రెడ్డిపై హెచ్ఆర్‌సీలో ఫ‌హీం ఖురేషి ఫిర్యాదు

Faheem Qureshi | క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ (Karimnagar CP) గౌస్ ఆలంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) మ‌తం పేరుతో దూషించార‌ని రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యాసంస్థ‌ల సొసైటీ వైస్‌చైర్మెన్ ఫ‌హీం ఖురేషీ (Faheem Qureshi) మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ (Human Rights Commission)కు ఫిర్యాదు చేశారు.

A

Telangana | Published On Feb 2, 2026, 4.44 pm IST

Faheem Qureshi | కౌశిక్‌రెడ్డిపై హెచ్ఆర్‌సీలో ఫ‌హీం ఖురేషి ఫిర్యాదు
Advertisement

Faheem Qureshi | త్రినేత్ర‌.న్యూస్‌ : ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ (Karimnagar CP) గౌస్ ఆలంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) మ‌తం పేరుతో దూషించార‌ని రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యాసంస్థ‌ల సొసైటీ వైస్‌చైర్మెన్ ఫ‌హీం ఖురేషీ (Faheem Qureshi) మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ (Human Rights Commission)కు ఫిర్యాదు చేశారు. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడిన ఎమ్మెల్యేపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌మిష‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌తం పేరుతో దూషిస్తూ ఆయ‌న‌ను కించ‌ప‌రిచార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కరీంనగర్‌ జిల్లా వీణవంక(కౌశిక్ రెడ్డి స్వ‌గ్రామం) లో సమ్మక్క సార‌ల‌మ్మ జాతర వెళ్లేందుకు సిద్ధమైన కౌశిక్‌రెడ్డితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు నిర్బంధించారు. త‌న‌ను ఎందుకు వెళ్ల‌నివ్వ‌డం లేద‌ని ఎమ్మెల్యే ప్ర‌శ్నించ‌గా, వీణ‌వంక జాత‌ర‌కు వెళ్లొద్ద‌నే ఆదేశాలు ఉన్నాయ‌ని పోలీసులు చెప్ప‌డంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాన్వాయ్‌ని ముందుకు వెళ్లనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖ రెడ్డితో కలిసి కరీంనగర్‌-వరంగల్‌ రహదారిపై బైఠాయించారు. ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు బలవంతం వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement