త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

విద్యార్థులకు పరీక్షల కిట్స్‌ పంపిణీ

Exams Kits | ఇల్లందకుంట మండలం బుజ్నూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వ్య‌వ‌స్థాప‌కులు సతీశ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

P

Telangana | Published On Mar 2, 2026, 11.06 pm IST

విద్యార్థులకు పరీక్షల కిట్స్‌ పంపిణీ
Advertisement

Exams Kits | ఇల్లందకుంట మండలం బుజ్నూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వ్య‌వ‌స్థాప‌కులు సతీశ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు చదువుతున్న విద్యార్థుల చేతుల్లో ఉందని.. 10వ తరగతి అనే ఈ కీలక దశలో ప్రతి విద్యార్థి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

పరీక్ష ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు, స్టేషనరీ కిట్లు, ప్రాక్టీస్ కోసం అవసరమైన వైట్ పేపర్లు విద్యార్థులకు పంపిణీ చేశామన్నారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులమని గర్వంగా భావిస్తున్నామని, ఈ చిన్న సహాయం విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు ఒక చిన్న అడుగు కావాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, లక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ సతీశ్‌, బీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షులు బూర్గుల కుమారస్వామి, బీఆర్‌ఎస్‌ గ్రామ యూత్ అధ్యక్షుడు పాశం రాజు, పిట్టల రాజు, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement