Vinod Kumar | రానున్న రోజుల్లో కేబినెట్ నుంచి ఇంకెంత మంది పోతారో..?
Vinod Kumar | వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ నుంచి కేబినెట్‌లో వికెట్లు పడడం మొదలైందని, రానున్న రోజుల్లో క్యాబినెట్ నుంచి ఇంకా ఎంతమంది ఉంటారు.. ఎంతమంది పోతారో అని బయట గుసగుసలు వినిపిస్తున్నాయని అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Vinod Kumar | త్రినేత్ర.న్యూస్ : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ నుంచి కేబినెట్‌లో వికెట్లు పడడం మొదలైందని, రానున్న రోజుల్లో క్యాబినెట్ నుంచి ఇంకా ఎంతమంది ఉంటారు.. ఎంతమంది పోతారో అని బయట గుసగుసలు వినిపిస్తున్నాయని అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ముందు కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను దగ్గర ఉంచుకొని ఉన్న రెండేళ్ల పాటు పదవిని అనుభవించి మంచి పాలనను అందించాలని, హామీలను అమలు చేయాలని వినోద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే తక్షణమే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది రోజుల నిరసన కార్యక్రమాలలో భాగంగా ముగింపు రోజు అయిన మంగళవారం వరంగల్ నగర పరిధిలోని కాశీబుగ్గలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి వినోద్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తప్పుడు గ్యారెంటీ కార్డులతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక తప్పుడు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోవాల్సి వస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు తులం బంగారం ఉచితంగా ఇస్తామని, నగదు డబ్బులు ఇస్తామని, రైతు భరోసా పెంచుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, ఆటో కార్మికులకు ఆర్థిక సాయం చేస్తామని అంటూ అనేక మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వినోద్ కుమార్ ఆరోపించారు.
పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారని ఆ మేరకు అసెంబ్లీకి నల్ల టీషర్టులతో వెళుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అమానుషంగా పోలీసులు ప్రవర్తించారని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని ఇది ఏమాత్రం సరికాదన్నారు. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ కవిత
సెప్టెంబర్ 8, 2026

MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్కు లేదు..
సెప్టెంబర్ 8, 2026

DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ కవిత
- ●MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్కు లేదు..
- ●Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
- ●DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్
- ●RS Praveen Kumar | స్పీకర్ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Telangana Assembly Resolution | కేసీఆర్ క్షమాపణకు అసెంబ్లీలో తీర్మానం

Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ కవిత

MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్కు లేదు..

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?

DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్



