త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranaut | సాధార‌ణ న‌ర్స్ బయోపిక్‌లో బీజేపీ ఎంపీ – కంగ‌నా ర‌నౌత్ నెక్స్ట్ మూవీ క‌థ ఇదేనా?

కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించిన భార‌త భాగ్య విధాత మూవీ జూన్ 12న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా ఓ బ‌యోపిక్ అని స‌మాచారం. ముంబై ఉగ్ర‌దాడుల్లో నాలుగు వంద‌ల మంది ప్రాణాలు కాపాడిన న‌ర్స్ అంజ‌లి కుల్తే జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించార‌ట‌.

N

Entertainment | Published On Jun 6, 2026, 4.41 pm IST

Kangana Ranaut | సాధార‌ణ న‌ర్స్ బయోపిక్‌లో బీజేపీ ఎంపీ – కంగ‌నా ర‌నౌత్ నెక్స్ట్ మూవీ క‌థ ఇదేనా?
Advertisement

Kangana Ranaut | గ‌త కొన్నేళ్లుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటోంది బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ . లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తేజ‌స్‌, ఎమ‌ర్జెన్సీ, త‌లైవితో పాటు మ‌రికొన్ని ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ కంగ‌న‌కు న‌టిగా మంచి పేరు తెచ్చిపెట్టిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌రైన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. ఈ రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా మ‌రో ప్ర‌యోగంతో వ‌చ్చే వారం థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

నిర్మాత‌గా...

కంగ‌నా హీరోయిన్‌గా న‌టించిన భార‌త భాగ్య విధాత మూవీ జూన్ 12న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మ‌నోజ్ త‌పాడియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను కంగ‌నా ర‌నౌత్ స్వ‌యంగా నిర్మిస్తోంది.
భార‌త‌ భాగ్య విధాత ఓ బ‌యోపిక్ మూవీ అని టాక్ . 26 /11 ఉగ్ర‌దాడిలో ప‌లువురు ప్రాణాల‌ను కాపాడిన న‌ర్సు అంజ‌లి కుల్తే జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంద‌ట‌. ఉగ్ర‌దాడి టైమ్‌లో ముంబైలోని కామా హాస్పిట‌ల్‌లో అంజ‌లి న‌ర్స్‌గా ప‌నిచేస్తోంది. ఈ హాస్పిట‌ల్‌పై క‌స‌బ్‌తో పాటు మ‌రో ఉగ్ర‌వాది దాడిచేశారు. ఆ టైమ్‌లో మెట‌ర్నిటీ వార్డ్ ఇంఛార్జ్‌గా ఉన్న అంజ‌లి...హాస్పిట‌ల్‌లోకి ఉగ్ర‌వాదులు రాకుండా అడ్డుకోవ‌డ‌మే కాకుండా చాలా మంది ప్రాణాల‌ను కాపాడింది. ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన క‌స‌బ్ శిక్ష ప‌డే స‌మ‌యంలో సాక్ష్యం చెప్ప‌డానికి న‌ర్స్ డ్రెస్‌లోనే అంజ‌లి కోర్టుకు వ‌చ్చింది.

క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో కాకుండా...

వీర వ‌నిత‌గా పేరుతెచ్చుకున్న అంజ‌లి కుల్తే జీవితం ఆధారంగానే భార‌త భాగ్య విధాత మూవీ రూపొంద‌నుంద‌ట‌. ఉగ్ర‌దాడిని అంజ‌లి ఎలా ధైర్యంగా ఎదుర్కొంది? సామాన్యుల ప్రాణాల‌ను కాపాడ‌టానికి ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డింద‌నే అంశాల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ట‌. కేవ‌లం ఉగ్ర‌దాడి సంఘ‌ట‌లు మాత్ర‌మే కాకుండా న‌ర్స్‌ల లైఫ్ ఉంటుంద‌న్న‌ది రియ‌లిస్టిక్‌గా సినిమాలో ఆవిష్క‌రించార‌ట‌. గ‌త రెండేళ్లుగా పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం కూడా ఈ పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని కంగ‌నా ర‌నౌత్ చెప్పింది.

 

Advertisement
Advertisement