త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Danam Nagender | త‌ప్పుల‌త‌డ‌క‌గా స‌ర్ ప్ర‌క్రియ : దానం నాగేంద‌ర్

Danam Nagender | దేశ వ్యాప్తంగా స‌ర్ ప్ర‌క్రియ త‌ప్పుల‌త‌డ‌క‌గా జ‌రుగుతుంద‌ని ఖైర‌తాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ తెలిపారు. ఎన్నికల సంఘం ఒక పార్టీకి అనుబంధంగా పని చేస్తోంది అని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 27, 2026, 6.56 pm IST

Danam Nagender | త‌ప్పుల‌త‌డ‌క‌గా స‌ర్ ప్ర‌క్రియ : దానం నాగేంద‌ర్
Advertisement

Danam Nagender | త్రినేత్ర న్యూస్ : దేశ వ్యాప్తంగా స‌ర్ ప్ర‌క్రియ త‌ప్పుల‌త‌డ‌క‌గా జ‌రుగుతుంద‌ని ఖైర‌తాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ తెలిపారు. ఎన్నికల సంఘం ఒక పార్టీకి అనుబంధంగా పని చేస్తోంది అని విమ‌ర్శించారు. స‌ర్ త‌ప్పులత‌డ‌క‌గా ఉంద‌ని దేశ‌మంతా కోడై కూసింది.. ఇప్ప‌టికైనా అర్థం చేసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. ఓటు అనేది పౌరుడి ప్రాథ‌మిక హ‌క్కు. దాన్ని తీసే హ‌క్కు ఎవ‌రికీ లేదు. ఓటు హ‌క్కును తీసేయ‌డ‌మంటే రాజ్యాంగ విరుద్ధ‌మే. సామాన్యుడి హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నారు కాబ‌ట్టే దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఒక్క ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే 81 వేల మందికి స‌ర్ నోటీసులు అందాయ‌న్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ కాలరాసే ప్రయత్నం చేస్తోంది అని దానం నాగేంద‌ర్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement