Chinna Reddy | హామీని నిలబెట్టుకోండి.. రాజ్యసభకు పంపండి.. ఖర్గేకు చిన్నారెడ్డి విన్నపం
Chinna Reddy | తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు స్థానాలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది.
Chinna Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు స్థానాలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది. దీంతో పలువురు సీనియర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు.. రాజ్యసభ ఎన్నికల బరిలో దిగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న జిల్లెల చిన్నారెడ్డి రాజ్యసభకు పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీ అధిష్ఠానానికి తెలియజేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఖర్గేను ఆయన కోరారు. రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనను రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీనిచ్చిన విషయాన్ని చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తెచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఖర్గేను చిన్నారెడ్డి కోరారు.
బీఆర్ఎస్ తరపున కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. కేఆర్ సురేశ్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇక కేశవరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆయన రాజ్యసభ పదవీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకు నామినేట్ చేశారు.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



