Vemula Prashanth Reddy | సాగు నీళ్లు లేక.. తల్లడిల్లుతున్న నిజామాబాద్ రైతులు
Vemula Prashanth Reddy | సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో నిజామాబాద్ రైతులు తల్లడిల్లి పోతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు.
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో నిజామాబాద్ రైతులు తల్లడిల్లి పోతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
శాసనసభలో నిజామాబాద్ రైతుల గురించి మాట్లాడండని అనేక మంది అన్నదాతలు ఫోన్లు చేశారు. ఈ క్రమంలో కరువు పరిస్థితులపై మేం ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం శ్రీరాం సాగర్‌లో 46 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో 6 టీఎంసీలు కేటాయిస్తే నిజామాబాద్ జిల్లాలో ఉన్న 2 లక్షల ఎకరాల పంటలను కాపాడుకోవచ్చు అని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఒకట్రెండు మోటార్లే ఆన్ చేస్తున్నారు
గుత్ప - అల్లీ సాగర్ పై 100 చెరువులు ఆధారపడి ఉన్నాయి. గుత్ప నుంచి 540 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలీ సాగర్ కెపాసిటీ 720 క్యూసెక్కులు అయితే.. ఒకట్రెండు మోటార్లే ఆన్ చేస్తున్నారు. గుత్ప, అలీ సాగర్ మోటార్లు నడిపి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రివర్స్ పంపింగ్ చేసి చెరువులు నింపండి..
బాల్కొండ నియోజకవర్గంలో లక్ష్మీ కెనాల్ ఉంటుంది. లక్ష్మీ కెనాల్, చౌటుపల్లి హన్మంతరెడ్డి కెనాల్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సారంగపూర్ పంపు హౌజ్‌ను దగ్గర ఉండి హరీష్ రావు పూర్తి చేశారు. గాయత్రి పంపు హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావు మీడియా సమావేశం చూసి ఒక రైతు మెసేజ్ పెట్టాడు. పడిగల్ సబ్ స్టేషన్‌లో 7 నుంచి 8 గంటల వరకే కరెంట్ వస్తుందని హన్మంతరెడ్డి అంటున్నాడు అని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | దళితులపై అంత ప్రేమ ఉంటే.. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం చేయ్
సెప్టెంబర్ 10, 2026

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
సెప్టెంబర్ 10, 2026

Sabitha Indra Reddy | వస్తున్నామని చెప్పి వచ్చినా సీఐ లేరిక్కడ
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
- ●Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?
- ●Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు
- ●Anupama Parameswaran | పెళ్లి బరాత్‌లో అనుపమ మాస్ స్టెప్పులు - క్రేజీ కళ్యాణం కోసం తెలంగాణ యాసలో డబ్బింగ్
- ●Sabitha Indra Reddy | వస్తున్నామని చెప్పి వచ్చినా సీఐ లేరిక్కడ

Pooja Hegde | తొలి సినిమా హీరోతో బుట్టబొమ్మ బాక్సాఫీస్ ఫైట్ - పూజా హెగ్డే శ్రీశ్రీ రిలీజ్ డేట్ ఇదేనా?

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు

Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?

Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు



