Talasani Srinivas Yadav | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులా..?
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసు అంటూ ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది.. మొదటిసారి చూస్తున్నా.. అసెంబ్లీకి వెళ్తున్న వారిపై ఇలాటి కేసులు పెట్టడం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఇలాంటి కేసులు పెట్టడం మొదటిసారి చూస్తున్నా
తాతా మధు అన్నట్టు నిరూపిస్తే..
క్షమాపణ చెప్పేందుకు మేమంతా సిద్ధం
మీడియాతో మాజీ మంత్రి తలసాని
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసు అంటూ ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది.. మొదటిసారి చూస్తున్నా.. అసెంబ్లీకి వెళ్తున్న వారిపై ఇలాటి కేసులు పెట్టడం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ గేటు బయట అంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముంది..? పోలీసుల తోపులాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దెబ్బలు తగిలాయి. మహిళా ఎమ్మెల్యేలైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి గొంతు, చీర పట్టి లాగారు. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. స్పీకర్‌ను తాతా మధు అన్నట్టు నిరూపిస్తే బిఆర్ఎస్ శాసన సభ్యులు మొత్తం క్షమాపణ చెప్పేందుకు సిద్ధం.. మాకు ఎటువంటి భేషజాలు లేవు అని తలసాని పేర్కొన్నారు.
దళిత స్పీకర్ అన్నట్లు చరిత్రలోనే లేదు
అసెంబ్లీ బయట స్పీకర్ పరిధి కానే కాదు... తాతా మధు అనని మాటలను ఆయనకు ఆపాదించారు. స్పీకర్‌ను తాతా మధు అన్నట్టు నిరూపిస్తే బిఆర్ఎస్ శాసన సభ్యులు మొత్తం క్షమాపణ చెప్పేందుకు సిద్ధం.. మాకు ఎటువంటి భేషజాలు లేవు అని తలసాని పేర్కొన్నారు. భారతదేశ దేశ రాజకీయాల్లో రెడ్డి స్పీకర్, బీసీ స్పీకర్, దళిత స్పీకర్ అన్నట్లు చరిత్రలోనే లేదు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా గౌరవం. దళిత స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ చూడలేదు. స్పీకర్ దళితుడు అని ఈ రాష్ట్ర ప్రజలకు సగం మందికి కూడా తెలియదు. ముఖ్యమంత్రి , మంత్రులు పదే పదే దళితుడు దళితుడు అనబట్టే గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడని తెలిసింది అని తలసాని పేర్కొన్నారు.
గడ్డం ప్రసాద్ కుమార్‌ను సీఎంగా చేయాలి
దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నాము. దళితులపై ప్రేమ చూపిస్తున్న రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసి నిరూపించుకోవాలి అని డిమాండ్ చేశారు.
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గర దళితులు డప్పు కొడితే శుద్ధి చేశారని ముఖ్యమంత్రి అంటున్నాడు. తూముకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి దళితుడా..! కేసీఆర్ చావును కోరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు
- ●Anupama Parameswaran | పెళ్లి బరాత్‌లో అనుపమ మాస్ స్టెప్పులు - క్రేజీ కళ్యాణం కోసం తెలంగాణ యాసలో డబ్బింగ్
- ●Sabitha Indra Reddy | వస్తున్నామని చెప్పి వచ్చినా సీఐ లేరిక్కడ
- ●Apar Industries | ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్ ఇస్తున్న కంపెనీ.. తేదీ ఎప్పుడంటే..
- ●Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..
- ●Indias nuclear arsenal | భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్స్

Adilabad Khichdi Sellers Sons | ఉదయం కిచిడీ బండి.. రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ : నీట్ క్రాక్ చేసి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన యువకులు

Anupama Parameswaran | పెళ్లి బరాత్‌లో అనుపమ మాస్ స్టెప్పులు - క్రేజీ కళ్యాణం కోసం తెలంగాణ యాసలో డబ్బింగ్

Sabitha Indra Reddy | వస్తున్నామని చెప్పి వచ్చినా సీఐ లేరిక్కడ

Apar Industries | ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్ ఇస్తున్న కంపెనీ.. తేదీ ఎప్పుడంటే..




