Vijay Diwas | తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర : మాజీ మంత్రి తలసాని
Vijay Diwas | తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నిమ్స్ హాస్పిటల్‌లోని రోగులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు.
Vijay Diwas | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నిమ్స్ హాస్పిటల్‌లోని రోగులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1969 లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ, నాటి నాయకులు కేంద్రప్రభుత్వానికి తలొగ్గి ఉద్యమాన్ని నీరుగార్చేవారని పేర్కొన్నారు. 400 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. 2001లో కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి, ఉద్యమంలో భాగంగా సాగర హారం, సకల జనుల సమ్మె, వంట వార్పు వంటి కార్యక్రమాలతో సుదీర్ఘ కాలం పోరాటం చేసి ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్ని వర్గాలను కేసీఆర్ ఐక్యం చేశారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు.

దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా మార్గాన్నే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అనుసరించిన అహింసా మార్గంలో పోరాడారని తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ జాతిని మొత్తం ఏకం చేసిందని అన్నారు. 11 రోజుల కేసీఆర్ దీక్షకు నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9న ప్రకటన చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఈరోజును విజయ్ దివస్‌గా ఘనంగా జరుపుకుంటున్నట్లు వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నాయకులు మాగంటి సునీత, విప్లవ్ కుమార్, మేడె రాజీవ్ సాగర్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



