Srinivas Goud | మళ్లీ పరాయి పాలన ఆనవాళ్లు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పరాయి పాలన ఆనవాళ్లు మళ్లీ మొలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మిలియన్ మార్చ్‌కి నేటికి 15 ఏళ్లు..
కాంగ్రెస్ పాలనపై మరో మిలియన్ మార్చ్ జరగాలి
అసమర్థ ప్రభుత్వంపై పోరాడాలి
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పరాయి పాలన ఆనవాళ్లు మళ్లీ మొలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్‌కి నేటికి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఓ అపూర్వ ఘట్టం. పోలీసుల నిర్బంధాలను, ఆంక్షలను లెక్క చేయకుండా పదిహేనేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు లక్షలాది మంది తెలంగాణ కోసం రోడ్ల పైకి వచ్చి ఐక్యతను చాటారు. నాడు మిలియన్ మార్చ్‌లో పాల్గొనడం గర్వంగా ఉంది. తెలంగాణ సాధనకు మిలియన్ మార్చ్ దోహద పడింది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
వచ్చిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ పాలనలో సాకారం చేసుకున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. పరాయి పాలన ఆనవాళ్లు మళ్ళీ మొలుస్తున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు లేవు, రైతుబంధు లేదు. కృష్ణా నీళ్లను సరిగా వాడుకోవడం లేదు. ప్రాజెక్టులకు కాలువలు తవ్వక ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోతోంది. ఏపీలో పని చేసిన అధికారికి సాగునీటి శాఖలో కీలక భాద్యతలు అప్పజెప్పి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరో మిలియన్ మార్చ్ జరగాల్సిన అవసరం ఉంది. నాటి మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఈ అసమర్ధ ప్రభుత్వంపై పోరాడి హక్కులు సాధించుకోవాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మిలియన్ మార్చ్ సందర్భంగా అమరవీరులకు బీఆర్ఎస్ తరపున నివాళులర్పిస్తున్నాం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



