త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | బీఆర్ఎస్ హెచ్చ‌రించినందుకే.. పాల‌మూరు ఎత్తిపోత‌ల మోటార్లు ప్రారంభం

Niranjan Reddy | నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌ను ముట్ట‌డిస్తామ‌ని బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) హెచ్చ‌రించినందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌మూరు ఎత్తిపోత‌ల మోటార్లు ప్రారంభించింద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి( Niranjan Reddy ) పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 14, 2026, 4.48 pm IST

Niranjan Reddy | బీఆర్ఎస్ హెచ్చ‌రించినందుకే.. పాల‌మూరు ఎత్తిపోత‌ల మోటార్లు ప్రారంభం
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర న్యూస్ : నార్లాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌ను ముట్ట‌డిస్తామ‌ని బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) హెచ్చ‌రించినందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌మూరు ఎత్తిపోత‌ల మోటార్లు ప్రారంభించింద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి( Niranjan Reddy ) పేర్కొన్నారు. కొన్ని నెలలుగా పాలమూరు పంపులు ప్రారంభించాలని, నార్లపూర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు అనుసంధానం చేసి ఎల్ నినో ఇబ్బందులు తొలగించాలని నిరంజ‌న్ రెడ్డి డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు ప్రారంభించకుంటే కేటీఆర్‌తో కలసి నార్లాపూర్ ముట్టడిస్తామని హెచ్చరించాం. దీంతో గత కొన్ని రోజులుగా పంపులు ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతూ వ‌చ్చింది. తాజాగా నిన్న మళ్లీ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి నార్లాపూర్ సందర్శించి పంపులు ఆన్ చేస్తారా ? లేక రైతులతో కలిసి ఆన్ చేయాలా ? అని హెచ్చరించారు. దీంతో ఈ రోజు మొద్దు నిద్ర వీడి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆన్ చేసింది. నార్లాపూర్ రిజర్వాయర్‌లో 6.5 టీఎంసీల నీరు నిండేంత వరకు పంపులు ఆపొద్దని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement