త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jailer 2 | ‘జైలర్‌ 2’పై తగ్గిన బజ్‌.. బాక్సాఫీస్‌ వద్ద రజనీ మ్యాజిక్‌ పనిచేసేనా?

Jailer 2 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ సినీ పరిశ్రమలో రూ.1,000 కోట్ల వసూళ్ల మార్కును అందుకునే తొలి చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుతం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ సాగుతోంది.

P

Entertainment | Published On Oct 14, 2026, 4.21 pm IST

Jailer 2 | ‘జైలర్‌ 2’పై తగ్గిన బజ్‌.. బాక్సాఫీస్‌ వద్ద రజనీ మ్యాజిక్‌ పనిచేసేనా?
Advertisement

Jailer 2 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ సినీ పరిశ్రమలో రూ.1,000 కోట్ల వసూళ్ల మార్కును అందుకునే తొలి చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుతం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. రజనీకాంత్‌ గత చిత్రం ‘కూలీ’ విడుదలకు ముందు భారీ హైప్‌ సొంతం చేసుకుంది. బుక్‌మైషో టికెట్ సేల్స్ ప్ర‌కారం.. ఆ సినిమా రిలీజ్‌కు ముందే సుమారు 20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కానీ ‘జైలర్‌ 2’ బుకింగ్స్‌ ఇప్పటివరకు అందులో సగానికి కూడా చేరలేదని తెలుస్తోంది. రజనీకి ఉన్న క్రేజ్‌, తొలి భాగం సాధించిన విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడినా.. అవి అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు చేరువలో..

ప్రస్తుతం ‘జైలర్‌ 2’ గ్లోబల్‌ ప్రీ-సేల్స్‌ వసూళ్లు రూ.60 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉన్నట్లు సమాచారం. రజనీకాంత్‌ స్టార్‌డమ్‌, అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, తొలి భాగం సాధించిన విజయం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయి. వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ తారలు అతిథి పాత్రల్లో కనిపించనుండటం కూడా ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సానుకూల అంశాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లుగా మారాలంటే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావాల్సి ఉంది. సినిమా విడుదలైన తర్వాత వచ్చే టాక్‌, మౌత్‌ టాక్‌ వసూళ్లపై కీలక ప్రభావం చూపనున్నాయి.

తెలుగులోనే అంతంతే..

తెలుగు రాష్ట్రాల్లోనూ ‘జైలర్‌ 2’పై ప్రస్తుతం ఆశించిన స్థాయిలో బజ్‌ కనిపించడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. తమిళంలో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ బలంగా ఉన్నప్పటికీ.. ఇతర భాషల్లో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తొలి భాగం చూసిన ప్రేక్షకులను సీక్వెల్‌ ఏ మేరకు మెప్పిస్తుందనేదే కీలకం కానుంది. ‘జైలర్‌ 2’కు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించగా, సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. విడుదలకు ముందు బుకింగ్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోయినా.. సినిమా కంటెంట్‌ బాగుంటే వసూళ్లు పుంజుకునే అవ‌కాశం ఉంది. తొలి రోజు ప్రేక్షకుల స్పందన, రివ్యూలు, మౌత్‌ టాక్‌ ఈ చిత్రం భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించ‌నున్నారు. మరి రజనీకాంత్‌ తనదైన స్టైల్‌తో మరోసారి బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ చేస్తారా? అనేది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

Advertisement
Advertisement