Soma Bharat Kumar | హరీశ్రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు
Soma Bharat Kumar | కాంగ్రెస్( Congress ) చెత్త పనులకు ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక పోతుంది అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్( Soma Bharat Kumar ) పేర్కొన్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.
ఫేక్ షోకాజ్ నోటీసు కాంగ్రెస్ సృష్టే
ఈ నోటీసుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా
నీచమైన పనికి పాల్పడ్డ వారిని శిక్షించాల్సిందే
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్
Soma Bharat Kumar | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్( Congress ) చెత్త పనులకు ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక పోతుంది అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్( Soma Bharat Kumar ) పేర్కొన్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సోమ భరత్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
నా పేరుపై ఒక ఫేక్ షోకాజ్ నోటీసు కాంగ్రెస్ సృష్టించింది. హరీష్ రావుకు నేను షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు ఫేక్ షోకాజ్ నోటీసు సర్క్యులేట్ అవుతుంది. హరీష్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు. ఫేక్ షోకాజ్ నోటీసుపై క్రిమినల్ ఫిర్యాదు చేస్తాం. నీచమైన పనికి పాల్పడ్డ వారిని శిక్షించాల్సిందే. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నమ్ముతున్నామని ఆయన పేర్కొన్నారు.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నీచానికి పాల్పడుతోంది. కాంగ్రెస్ దొంగ ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు. బీఆర్ఎస్ సిస్టమాటిక్గా సమాజంలో ఉంది. క్రైమ్ జరిగినప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలి. లేదంటే రాజ్యాంగ బద్దమైన కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం. కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫేక్ షోకాజ్ నోటీసు వచ్చింది. అధికారంలో ఉండి ఫోర్జరీ సంతకంతో ఫేక్ షోకాజ్ నోటీసు సృష్టించడానికి సిగ్గు లేదా అని సోమ భరత్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
- ●Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?
- ●Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి
- ●Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు
- ●Dell XPS 13 | 2.5కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్టాప్లు.. ధర ఎంతంటే..
- ●Justice Madan Lokur | ఓటర్ల జాబితా సవరణపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. సమస్యలపై మాజీ జడ్జిల కమిషన్.. రేపే తొలి విచారణ

Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..

Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?

Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి

Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు




