Niranjan Reddy | బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అవివేకం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు అవివేకం అని మండిపడ్డారు.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు అవివేకం అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్, భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగానికి లోబడి దేశ అత్యున్నత పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితం. దశాబ్దాల పోరాటం మూలంగా తెలంగాణ సాక్షాత్కరించింది. మిడిమిడిజ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అవాకులు, చెవాకులు పేలుతున్నారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మీద దాడి చేస్తున్నది అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించాలి. పార్లమెంటులో తెలంగాణ విభజన విషయంలో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
ఆగస్టు 11, 2026

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
ఆగస్టు 11, 2026

Naveen Nicolas | పాఠశాలల భవనాలు పూర్తయ్యేలోపు ఫర్నీచర్ ఉండాలి.. నిధుల సమస్య రాకుండా చూసుకోండి
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు
- ●Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
- ●Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!
- ●Uppal Elevated Corridor | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెప్పుడు పూర్తవుతుంది : ఏజెన్సీపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
- ●Sangareddy Road Accident | నెత్తురోడిన రహదారి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కూలీల దుర్మరణం
- ●Kanti Velugu Victims Compensation | హనుమకొండ ‘కంటి వెలుగు’ బాధితులకు ఎట్టకేలకు న్యాయం.. భారీ పరిహారం ప్రకటించిన TGHRC

Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!

Uppal Elevated Corridor | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెప్పుడు పూర్తవుతుంది : ఏజెన్సీపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్



