త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uppal Elevated Corridor | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెప్పుడు పూర్తవుతుంది : ఏజెన్సీపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని, ఈ నెలాఖరు నాటికి కారిడార్ కింద బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.

J

Hyderabad | Published On Aug 11, 2026, 9.37 pm IST

Uppal Elevated Corridor | ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెప్పుడు పూర్తవుతుంది :  ఏజెన్సీపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

సంక్షిప్త సారాంశం

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ (Uppal Elevated Corridor) పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెక్రటేరియట్‌లో కీలక సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 2026 నాటికి ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచేందుకు కార్మికుల సంఖ్యను పెంచి (Manpower), మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా పనులు జరగాలని స్పష్టం చేశారు. కారిడార్ కింద ఉన్న 6.25 కిలోమీటర్ల బీటీ (BT) రోడ్డు నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికల్లా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు.

Advertisement

Uppal Elevated Corridor | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిష్టాత్మక 'ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్' (Uppal Elevated Corridor) పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సెక్రటేరియట్‌లో ఆర్ అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని, ఆలస్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన అధికారులకు, వర్క్ ఏజెన్సీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అక్టోబర్ 2026 నాటికి అందుబాటులోకి రావాల్సిందే

"నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాల్సిందే. ఈ రూట్‌లో ప్రయాణించే వారికి ఏళ్ల తరబడి ఇది నరకప్రాయంగా మారింది. అక్టోబర్ 2026 నాటికి ఈ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనది జవాబుదారీ ప్రభుత్వం. మాట తప్పే ప్రసక్తే లేదు" అని మంత్రి కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు. అధికారులు మనసు పెట్టి పనిచేసి, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సురక్షిత ప్రయాణాన్ని అందించాలని ఆయన సూచించారు.

మూడు షిఫ్టుల్లో పనులు.. రాత్రివేళ నాన్‌స్టాప్

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, పనుల్లో స్పీడ్ పెంచాలని ఆదేశించారు. మ్యాన్ పవర్ (Manpower) పెంచి మూడు షిఫ్టుల్లో పనిచేయాలని, ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. అలాగే కారిడార్ కింద ఉన్న 6.25 కిలోమీటర్ల బీటీ రోడ్డు (BT Road) పనులను ఈ నెలాఖరుకల్లా కంప్లీట్ చేయాలని డెడ్‌లైన్ (Deadline) విధించారు.

అటు నారపల్లి, ఇటు ఉప్పల్ వైపు నుంచి లాంచింగ్ గడ్డర్లతో సమాంతరంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. "ప్రతి పది రోజులకు ఒకసారి నేను స్వయంగా సైట్ విజిట్ చేసి పనుల పురోగతిని సమీక్షిస్తాను. ప్రతిరోజూ వర్క్ ప్రోగ్రెస్ నాకు చేరాలి" అని ఆయన స్పష్టం చేశారు.

వర్షాల వల్ల లేట్ అవుతోందన్న ఏజెన్సీ.. మంత్రి అసంతృప్తి

ప్రస్తుతం కారిడార్ పనులు 60 శాతం పూర్తయ్యాయని, మిగతా 40 శాతం పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. 300 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే, వర్షాలు, రాత్రివేళ పనుల వల్ల మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా.. మంత్రి దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు కనీసం ఆరు స్లాబుల చొప్పున పూర్తి చేయాలని ఆయన తేల్చి చెప్పారు. దీనికి అనుసంధానంగా జీహెచ్ఎంసీ (GHMC) నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను కూడా సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.

Advertisement
Advertisement