త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!

తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మానవ నిర్మిత విపత్తని డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

J

Telangana | Published On Aug 11, 2026, 9.55 pm IST

Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం, ఎండిపోయిన రిజర్వాయర్లపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఇది ప్రకృతి కోపం కాదని, మూడు నెలల ప్రభుత్వ పరిపాలనా అలసత్వం వల్లే ఈ కరవు ఏర్పడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం యాగాలు, పూజలు చేస్తే ప్రాజెక్టుల్లో నీళ్లు రావని ఆయన ఎద్దేవా చేశారు. తక్షణమే విత్తన రాయితీ, వ్యవసాయ నిధులు విడుదల చేసి, నీటి యాజమాన్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
  • ఎల్ నినో ఎఫెక్ట్
  • వ్యవసాయ సంక్షోభంపై సీఎంకు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
  • ఇది 'మానవ నిర్మిత విపత్తు' అంటూ ఫైర్

Dasoju Sravan Open Letter to CM | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, ఎండిపోయిన రిజర్వాయర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dr. Dasoju Sravan) ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ఈ వానకాలం సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన కష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

యాగాలు చేస్తే నీళ్లు రావు

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు లాంటి పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం ఎంతమాత్రమూ కాదని, ఇది ప్రభుత్వ అనాలోచిత పరిపాలనా అలసత్వం వల్ల ఏర్పడిన "మానవ నిర్మిత విపత్తు" అని డాక్టర్ శ్రవణ్ మండిపడ్డారు. వానలు పడలేదని దేవుడిపై భారం వేసి, 'వరుణ యాగాలు' (Varuna Yagams) చేస్తే సరిపోదని, సకాలంలో ఫైళ్లు కదిపి నిధులు విడుదల చేయాలని హితవు పలికారు. ఏప్రిల్‌లోనే ఎల్ నినో (El Nino) హెచ్చరికలు ఉన్నా, జూలై వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

సగం పడిపోయిన సాగు విస్తీర్ణం

ఏప్రిల్ నెలలో కేవలం ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో నిధుల కోసం కమిటీ వేయడానికి జూలై 18 వరకు ఎదురుచూసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిద్రలేచే సరికి సాగు విస్తీర్ణం ఘోరంగా పడిపోయిందని.. 2025తో పోలిస్తే 48.66% మాత్రమే విత్తనాలు పడ్డాయని, సుమారు 32.20 లక్షల ఎకరాల కొరత ఏర్పడిందని కమిటీ నివేదికను ఉటంకిస్తూ వివరించారు.

మేడిగడ్డ జాప్యం.. రాజకీయ కక్షసాధింపు

మేడిగడ్డ బ్యారేజీ (Medigadda barrage) పిల్లర్లు కుంగిన తర్వాత వెంటనే మరమ్మతులు చేయకుండా, దాన్ని రెండున్నరేళ్ల పాటు రాజకీయ కక్షసాధింపులకు వాడుకున్నారని శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనివల్లే తెలంగాణ చెరువులు నింపాల్సిన గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయని, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో 33.5% అధిక వర్షపాతం నమోదైనా.. క్యారీ-ఓవర్ స్టోరేజ్ (Carry-over storage) నిబంధనలు పాటించకపోవడం వల్లే రిజర్వాయర్లు నిలువునా ఎండిపోయాయని మండిపడ్డారు.

ప్రభుత్వానికి శ్రవణ్ ప్రధాన డిమాండ్లు

సమాధానం చెప్పాలి: మూడు నెలల పాటు నిర్ణయాలు తీసుకోకుండా జరిగిన జాప్యానికి అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాలి.

నిధుల విడుదల: క్యాబినెట్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న రూ. 329.18 కోట్ల విత్తన రాయితీ, రూ. 452.80 కోట్ల సూక్ష్మ సేద్యం నిధులను తక్షణమే విడుదల చేయాలి.

శ్వేతపత్రం: మిగులు వర్షపాతం ఉన్నా నీళ్లెందుకు లేవో వివరిస్తూ నీటి యాజమాన్యంపై శ్వేతపత్రం (White paper) విడుదల చేయాలి.

పంటల బీమా: రైతులకు అండగా సమగ్ర పంటల బీమా (Crop Insurance) పథకాన్ని ప్రవేశపెట్టాలి.

విచారణ కమిటీ: మేడిగడ్డ మరమ్మతుల్లో జరిగిన జాప్యంపై లెక్కలు బయటపెట్టాలి, అలాగే ఈ పరిపాలనా వైఫల్యంపై స్వతంత్ర విచారణ కమిటీని వేయాలి.

Advertisement
Advertisement