Harish Rao | రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్.. కేరళలో కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయం : హరీశ్‌రావు
Harish Rao | ఉన్నవి ఊడగొట్టడం తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ఒక ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ కాలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని హరీశ్‌రావు అన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఉన్నవి ఊడగొట్టడం తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ఒక ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ కాలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని హరీశ్‌రావు అన్నారు. మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. కొడంగల్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ కొడంగల్ ప్రాంతంలో గిరిజనులు ఆత్మగౌరవంగా భావించే లోకామసంద్ మహరాజ్ బావోజీ దేవాలయానికి గతంలో కనీసం వాగు దాటి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. గతంలో నరేందర్ రెడ్డి కృషితో, నాటి సీఎం కేసీఆర్ రూ. 8 కోట్లు ఇచ్చి వాగుపై బ్రిడ్జి నిర్మించారు. కేసీఆర్ మరో రూ. 80 లక్షలు గుడి కోసం, రూ. 50 లక్షలు బంజారా భవన్ కోసం కేటాయించారు. లంబాడా పోరాట సమితి దశాబ్దాలుగా కొట్లాడితే.. కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు ఎందరొచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. 3100 గిరిజన గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచాం, ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చాం, మార్కెట్ కమిటీల్లో, వైన్ షాపుల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఖర్చు చేసింది కేవలం రూ. 52 కోట్లు మాత్రమే
కొడంగల్ తండాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా.. ఆడబిడ్డల కోసం డిగ్రీ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేటి వరకు లంబాడీలకు మంత్రి పదవి లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎస్టీ కార్పొరేషన్ కు బడ్జెట్‌లో రూ. 2730 కోట్లు చూపించి, ఖర్చు చేసింది కేవలం రూ. 52 కోట్లు మాత్రమే. రెండున్నరేళ్లలో ఒక్క ఎస్టీకి రూపాయి సాయం అందలేదు. ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి విడుదల చేయకుండా సేవాలాల్ మహరాజ్ గౌరవాన్ని కాంగ్రెస్ తగ్గించిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఎస్టీల భూములే లాక్కుంటున్నావా?
మనుమడితో ఫుట్ బాల్ ఆడుకోవడానికి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తావు, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, అందాల పోటీలకు పైసలు ఉంటాయి కానీ ఎస్టీ కార్పొరేషన్ కు, ఎస్టీ విద్యార్థులకు ఇవ్వడానికి నీకు పైసలు లేవా రేవంత్ రెడ్డి? ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అన్నావు, అధికారంలోకి రాగానే కొడంగల్‌లో ఎస్టీల భూములే లాక్కుంటున్నావా? జైళ్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావా? ఇదేనా నీకు ఎస్టీల మీద ఉన్న ప్రేమ? అని ఆయన నిలదీశారు.
కొడంగల్‌లో ఏ ఊరికి పోదాం చెప్పు
ఇక్కడ చేసిందేమీ లేదు కానీ.. కేరళకు పోయి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం.. ఇక్కడ కూడా చేస్తాం అని వచ్చిరాని ఇంగ్లీషు, హిందీలో పెద్ద డైలాగులు కొడుతున్నావు. తెలంగాణలో ఏ గ్యారెంటీలు అమలు చేశావు రేవంత్ రెడ్డి.. రైతు రుణమాఫీ చేశావా? మహిళలకు రూ. 2500 ఇచ్చావా? రైతు భరోసా, పెన్షన్ పెంపు, తులం బంగారం, స్కూటీలు.. ఏవి ఇచ్చావు? తెలంగాణలో గ్రామసభలు పెడితే నీ నాయకుల మీద, అధికారుల మీద అక్కచెల్లెళ్లు తిరగబడ్డారు. అసెంబ్లీలో మీ ప్రభుత్వమే 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఒప్పుకుంది.. మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తేలిపోయింది కదా.. నీ సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే సవాల్ విసురుతున్నా.. కొడంగల్‌లో ఏ ఊరికి పోదాం చెప్పు. ఏ ఊర్లో వంద శాతం రుణమాఫీ జరిగిందో చూద్దాం రా రేవంత్ రెడ్డి. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టావు. గత యాసంగి బోనస్ ఎగ్గొట్టావు, ఈ యాసంగి కూడా ఎగ్గొడతావు. ఉన్న కల్యాణ లక్ష్మి రావడం లేదు, కేసీఆర్ కిట్ బంద్, బతుకమ్మ చీరలు బంద్, మోటార్లకు కరెంట్ రావడం లేదు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడుకోబెట్టావు. 90 శాతం పనులు మేము పూర్తి చేస్తే, మిగిలిన ఆ 5 శాతం పనులు కాలువలు, బండరాళ్లు తొలగించడం పూర్తిచేసి నీళ్లు ఇవ్వడానికి నీకు చేతకావడం లేదు. మేము నిర్మించిన ఏదుల, వట్టెం ప్రాజెక్టుల ద్వారా మొన్న వచ్చిన నీళ్లను నింపుకుంటే ఈపాటికి ఇక్కడ బంగారు పంటలు పండేవి. నీళ్లు ఇస్తే ఆ పేరు కేసీఆర్‌కు వస్తుందనే కుట్రతోనే పాలమూరు ప్రజల గుండెల మీద తంతూ ప్రాజెక్టును ఆపేశావు. కడవల కాలువ నుంచి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ కింద లక్షన్నర క్యూసెక్కుల నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా.. కేవలం ఒక ప్రాజెక్టు కోసం రూ. 4500 కోట్లు దండుకోవాలని చూస్తున్నావు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా మక్తల్, నారాయణపేటకు లక్ష ఎకరాలు, కొడంగల్ కు లక్షన్నర ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ నువ్వు ఇప్పుడు కొత్తగా రూ. 4500 కోట్లతో తెస్తున్న లిఫ్ట్ ద్వారా మక్తల్‌కు 25 వేలు, నారాయణపేటకు 20 వేలు, కొడంగల్‌కు 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ కమీషన్ల కక్కుర్తి ఆపి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. గత రెండు సీజన్లలో నీళ్లను లిఫ్ట్ చేయకుండా ఆంధ్రాకు వదిలిపెట్టి పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అని హరీశ్‌రావు సూచించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



