Harish Rao | అమెరికాతో కేంద్రం ట్రేడ్ డీల్ ఒప్పందం.. రైతులకు తీవ్ర నష్టం : హరీశ్‌రావు
Harish Rao | అమెరికాతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ట్రేడ్ డీల్ ఒప్పందం చేసుకోవడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
సోయా, మక్కలు, పత్తి పండించే రైతేం కావాలి..?
సుంకాలు ఎందుకు తగ్గిస్తున్నారు..?
ట్రేడ్ డీల్ వల్ల రైతులకు ఏం లాభం..?
రాష్ట్రంలో కరువును పారదోలింది కేసీఆరే..
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి..
రైతు బడి అగ్రి షో ఎగ్జిబిషన్‌లో హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : అమెరికాతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ట్రేడ్ డీల్ ఒప్పందం చేసుకోవడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బడి అగ్రి షో కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌తో రైతులకు రకరకాల పంటల మీద రైతుబడి రాజేందర్ రెడ్డి అవగాహన కల్పిస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
ట్రేడ్ డీల్ ఒప్పందంలో సోయా, మక్కలు, పత్తి లాంటివి ఎలాంటి టాక్స్ లేకుండా దిగుమతి అవుతాయన్నారు. మరి సోయా పంటను ఎక్కువగా పండించే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ రైతుల పరిస్థితి ఏం కావాలి..? ఈసారి మక్కలు ఎక్కువ పండిస్తున్నారు. ఆ రైతుల పరిస్థితి ఏంటి? రూ. 45 లక్షల కోట్ల విలువైన మక్కజొన్న, పత్తి, సోయా అమెరికా మనకు పంపిస్తే మన దేశ రైతులు ఏం కావాలి? అని హరీశ్‌రావు నిలదీశారు. విదేశాల నుండి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ పైన 25 శాతం టాక్స్ ఉండేది కానీ ఇప్పుడు 16 శాతానికి తగ్గించడం వల్ల ఇక్కడ రూ. 25,000 ఉన్న పామ్ ఆయిల్ టన్ను రేట్ రూ. 21,000 లకు పడిపోయింది. ఈ సుంకాలు ఎందుకు తగ్గిస్తున్నారు? ఇవి తగ్గించడం వల్ల మన భారత రైతులకు ఏం లాభం జరుగుతుందో కేంద్రం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

కరువును పారదోలింది కేసీఆరే..
పట్టుపురుగుల పెంపకంలో సిద్దిపేట జిల్లా నంబర్‌వన్‌గా నిలిచింది. తీర ప్రాంతాల్లోనే పండే ఆయిల్ పామ్ ఇప్పుడు తెలంగాణలో పండుతుంది. రైతు ఆదాయం పెంచడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది. సిద్దిపేటలో 12000 ఎకరాల్లో ఈ సాగు జరుగుతుంది. వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుంది. ఒకప్పుడు కరువు ప్రాంతం, సాగు నీరు కాదు కదా తాగు నీటికి కూడా ఇబ్బంది పడ్డ ప్రాంతం తెలంగాణ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తొవ్వించి, కాలువలు తవ్వించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరంతో కరువును పారదోలారు. ఇవాళ దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డది అని హరీశ్‌రావు తెలిపారు.

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలి..
రైతులకు టెక్నాలజీ కావాలి. రైతులకు ఈరోజు లేబర్ పెద్ద సమస్యగా మారింది. పంజాబ్, ఝార్ఖండ్, యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి. బీహార్ నుంచి హమాలీలొస్తే కానీ మన కల్లాల్లో ధాన్యం ఎత్తే పరిస్థితి లేదు, మిల్లులల్లో దించే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అది ఎలాగైనా మన రైతాంగాలకి అందించాలి. యంత్రాలను ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండున్నర ఏండ్లలో అసలు ఎక్కడా కూడా వ్యవసాయ యంత్రాల మీద సబ్సిడీ అనేది లేకుండా పోయింది. రైతులకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలి. ఆ భరోసాను గతంలో కల్పించింది కేసీఆర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



