Harish Rao | ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతా : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao | రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర
కాంగ్రెస్ జూట మాటలతో అప్పులకుప్పగా ఆర్టీసీ
మహాలక్ష్మి పథకం కింద రూ. 2,804 కోట్లు బాకీ
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పష్టం చేశారు. మంగళవారం టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులు ఆయనను కలిసి, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి, కార్మికులకు చేస్తున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం
కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు అప్పగించి, వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా 2000 బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్ బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలను నేరుగా ఆర్టీసీకే ఇప్పించి, సంస్థ సొంతంగా బస్సులు కొనుగోలు చేసుకునేలా పథకంలో సవరణలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
కార్మికులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
జీరో టికెట్ అమలు కోసం ప్రతినెలా 350 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇపుడు అరకొర నిధులు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయం. గత రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని ఆర్టీసీపైనే మోపడం వల్ల సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్లో ఉండగా, 2025 పీఆర్సీ సైతం అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు.
గత 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదు
సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (CCS)లో దాచుకున్న పొదుపు మొత్తాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గత 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదని మండిపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా నిలుస్తుందనుకున్న డబ్బు చేతికి రాక కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 'అపాయింటెడ్ డే' ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు దక్కాల్సిన పదోన్నతులు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని హరీశ్‌రావు మండి మండిపడ్డారు.
కార్మికుల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తాం
ఉచిత ప్రయాణం పథకం సజావుగా సాగుతోందని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం.. రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనడంలో, సిబ్బందిని నియమించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సిబ్బంది కొరతతో ఉన్న కార్మికులపై తీవ్ర పని భారం పడుతోందని, ఆ ఒత్తిడి వల్ల కార్మికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమను చూపించకుండా. తక్షణమే రూ. 2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి. కార్మికుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బలంగా బీఆర్ఎస్ పక్షాన వినిపిస్తాం.. ప్రభుత్వం మెడలు వంచైనా పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



