త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఆ భూములు శార‌దా పీఠానికే.. ఇది భ‌క్తుల విజ‌యం : హ‌రీశ్‌రావు

Harish Rao | కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 28, 2026, 7.53 pm IST

Harish Rao | ఆ భూములు శార‌దా పీఠానికే.. ఇది భ‌క్తుల విజ‌యం : హ‌రీశ్‌రావు
Advertisement

రేవంత్‌కు బుద్ధి ప్ర‌సాదించిన అమ్మ‌వారికి న‌మ‌స్సులు
మ‌రి ఆ 17 ఎక‌రాల భూమి సంగ‌తి ఏంటి..?
ఆ క్ర‌ష‌ర్ యూనిట్‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి
ప్ర‌భుత్వ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై పోరాటం సాగిస్తాం
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కోకాపేటలో శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేయడం రాజ శ్యామలా దేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం. ఇది భక్తుల విజయంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరియైన బుద్ధి ప్రసాదించిన రాజ్య శ్యామల అమ్మవారికి నమస్సులు. ఎలాంటి స్పష్టమైన ప్రజా ప్రయోజన ప్రతిపాదిక లేకుండా, పర్యావరణ నియమ నిబంధనలకు విరుద్ధంగా , ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ, నామినేషన్ పద్ధతి లో మీ అల్లుడి అనుయాయులకి హెచ్ఎండీఏ ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటి? ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ ప్రభుత్వం చర్యలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement