Harish Rao | పోరాటానికి మారుపేరు దొడ్డి కొమురయ్య : హరీశ్‌రావు
Harish Rao | ఆనాడు దొడ్డి కొమురయ్య భూమి కోసం, భుక్తి కోసం, పేదల కోసం వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచారు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. పోరాటానికి త్యాగానికి మారు పేరు దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఆనాడు దొడ్డి కొమురయ్య భూమి కోసం, భుక్తి కోసం, పేదల కోసం వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచారు అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. పోరాటానికి త్యాగానికి మారు పేరు దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు. మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య విగ్రహానికి హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ కురుమల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దొడ్డి కొమురయ్య జయంతి శుభాకాంక్షలు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా జరిపిన ఘనత కేసీఆర్‌ది, బీఆర్ఎస్ పార్టీది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను, గొల్ల కురుమలను చిన్న చూపు చూస్తున్నది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. రెండున్నరేండ్లు అయింది. గొల్ల కురుమల సహకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. బడ్జెట్‌లో రూ. 100 కోట్లు పెట్టారు.. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. మొత్తం బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో పెట్టింది రూ. 1370 కోట్లు.. ఖర్చు పెట్టింది రూ. 6 కోట్లు మాత్రమే. ఆ 6 కోట్లు జీతాలకు తప్ప ఒక్క బీసీని ఆదుకున్నది లేదు. కాగితాల మీదనే నిధులు తప్ప ఆచరణలో లేవు. బీసీ సబ్ ప్లాన్ పెడతాం అన్నారు. అది లేదు. 42 శాతం రిజర్వేషన్లు బోగస్.. బీసీలకు ఇచ్చిన అన్ని హామీలు బోగస్. చివరికి నట్టల మందు సరఫరా చేయని దుస్థితి. అన్ని రకాలుగా దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



