త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నియో పోలిస్‌లో రేవంత్ రెడ్డి మేన‌ల్లుడు అక్ర‌మ మైనింగ్ : హ‌రీశ్‌రావు

Harish Rao | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మేన‌ల్లుడి మ‌నుషులు నియో పోలిస్‌లో అక్ర‌మ మైనింగ్ చేస్తున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఆరోపించారు. మొబైల్ క్ర‌షింగ్ ప్లాంట్‌కు మాత్ర‌మే నిబంధ‌న‌లు ఉండ‌గా, ఫిక్స్‌డ్ క్ర‌షింగ్ ప్లాంట్ నియో పోలిస్‌లో పెట్టార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 4, 2026, 5.43 pm IST

Harish Rao | నియో పోలిస్‌లో రేవంత్ రెడ్డి మేన‌ల్లుడు అక్ర‌మ మైనింగ్ : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మేన‌ల్లుడి మ‌నుషులు నియో పోలిస్‌లో అక్ర‌మ మైనింగ్ చేస్తున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ఆరోపించారు. మొబైల్ క్ర‌షింగ్ ప్లాంట్‌కు మాత్ర‌మే నిబంధ‌న‌లు ఉండ‌గా, ఫిక్స్‌డ్ క్ర‌షింగ్ ప్లాంట్ నియో పోలిస్‌లో పెట్టార‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.

ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలి. లెటర్‌లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోంది. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారు. అక్కడ రెడీమిక్స్‌కు పర్మిషన్ లేదు. పటాన్‌చెరు ఎమ్మెల్యేకు మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారు. దాదాపు 8 నుంచి 9 పర్మిషన్లు తీసుకోవాలి. ఓఆర్ఆర్‌కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉంది. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్ర‌క్ష‌న్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్‌లో మైనింగ్ దందా నడుపుతున్నది. రేపు నిజానిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం వెళ్తుంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఖమ్మంలో ఇండ్లు కూలగొట్టి జాగా ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేగలుగుతున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి. రేపటి వరకు వేచి చూద్దాం. నేను మంత్రిగా వున్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చాను. జర్నలిస్టులకు పెట్టిన 16 కోట్ల బడ్జెట్‌కు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పాలసీని వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారు. పాలసీ బాగుంటే ఎందుకు మాయం అయింది. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదు. ఎడ్యుకేషన్ కమీషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ మొదట మాట్లాడింది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సఫలం అవుతోంది. మా ఒత్తిడికి తలొగ్గే ప్రభుత్వం వివిధ అంశాలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement