Harish Rao | మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు!
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు అయిందని విమర్శించారు. గొప్పగా చెప్పుకున్న అభయహస్తం.. హామీలను అమలు చేయని మొండి హస్తంగా మారిందని ధ్వజమెత్తారు.
హామీలకు దిక్కు లేదు.. అమలు ఊసే లేదు
అభయ హస్తం.. శూన్య హస్తం అయింది
ప్రజలనే కాదు.. దేవుళ్లను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
నీటి మూటగానే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత హామీ
ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనత
కాంగ్రెస్ నయవంచనను ప్రజలు గుర్తించారు
ఇక మిగిలింది గుణపాఠం చెప్పడమే
కాంగ్రెస్ పాలన తీరుపై నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు అయిందని విమర్శించారు. గొప్పగా చెప్పుకున్న అభయహస్తం.. హామీలను అమలు చేయని మొండి హస్తంగా మారిందని ధ్వజమెత్తారు.
మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, దానిని తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల క్రితం ఇదే రోజు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా ఆ హామీలకు దిక్కులేదు. అమలు ఊసే లేదు. అభయ హస్తం.. శూన్య హస్తం అయ్యింది. ఓట్లు వేసిన ప్రజలనే కాదు.. ఒట్లు వేసి దేవుళ్లను, పవిత్ర గ్రంథాలను సైతం మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు? మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. తొలి క్యాబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలింది. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు? అని నిలదీశారు.
మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, హామీల అమలును గాలికొదిలేసారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీకి తూట్లు పొడిచారు. గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్.. గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేక పోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి చూస్తే గాంధీ ఆత్మ కూడా క్షోభిస్తుంది. ప్రజల ఆశలను ఓట్లుగా మార్చుకున్నారు. అధికారాన్ని అందుకున్నాక ఆ ఆశలను ఆవిరి చేశారు. హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనత. కాంగ్రెస్ మాయమాటలను, నయవంచనను తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇక మిగిలింది తగిన గుణపాఠం చెప్పడమే! అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026

Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు



