Harish Rao | ఢిల్లీలో నీతులు.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన : హరీశ్‌రావు
Harish Rao | ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పుబట్టారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే..
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది?
ఇది రాజ్యాంగ శూన్యత కాదా?
రాహుల్, కేసీ సమాధానం చెప్పాలి
మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పుబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలన్నారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేళ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలు తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెబుతారు.. ఇది రాజ్యాంగ శూన్యత కాదా అని ప్రశ్నించారు.
రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తోందని, ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయన్నారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ నైజమన్న హరీశ్ రావు, ఈ దొంగ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
అధికార దాహంతో ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అత్యంత సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



