త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప రైతు భ‌రోసా వేయ‌వా..? సీఎంను ప్ర‌శ్నించిన హ‌రీశ్‌రావు

Harish Rao | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప నువ్వు రైతు భ‌రోసా వేయ‌వా..? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సూటిగా ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Apr 21, 2026, 6.05 pm IST

Harish Rao | కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప రైతు భ‌రోసా వేయ‌వా..? సీఎంను ప్ర‌శ్నించిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప నువ్వు రైతు భ‌రోసా వేయ‌వా..? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సూటిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. నిన్న కేసీఆర్ జగిత్యాల సభలో గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశాడు. కేసీఆర్ బయటకు వస్తే తప్ప నువ్వు రైతు భరోసా వేయవా? నిన్న వేసిన కిస్తీ కేవలం కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి చేసిన పొలిటికల్ జిమ్మిక్కు మాత్రమే. రూ. 5000 కోట్లు వేయాల్సి ఉండగా ఇంకా రూ. 4000 కోట్లు బకాయి ఉంది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

వడ్లు కల్లాలకు వచ్చినా రైతు భరోసా పూర్తి స్థాయిలో వేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మున్సిపల్ ఎన్నికల తర్వాత మిగతా రైతు భరోసా ఇస్తానని రేవంత్ మిర్యాలగూడ, సిద్దిపేట సభల్లో చెప్పాడ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

Advertisement
Advertisement