Harish Rao | రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ మోడల్ కాదు.. క్రాస్ బ్రీడ్ బంధం : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ మోడల్ కాదు.. అది కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న క్రాస్ బ్రీడ్ బంధం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ మోడల్ కాదు.. అది కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న క్రాస్ బ్రీడ్ బంధం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. బడే భాయ్‌కి భయపడే ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించలేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో సభాస్థలి ఏర్పాట్లను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జీవన్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజకీయాల్లో ఎంతో విలువలతో కూడిన నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన చేరిక కరీంనగర్ జిల్లాకే కాదు, యావత్ ఉత్తర తెలంగాణకు, బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది.. 'రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి' అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అనడానికి జీవన్ రెడ్డి చేరిక ఒక సజీవ సాక్ష్యం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి..
నిన్న పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే. బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గం. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా?
కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు పాసై, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడింది. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణం. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుంది అని మాజీ మంత్రి పేర్కొన్నారు.
ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా?
నిన్నటి లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. మన ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లం. మన రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? అదే రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలిన కేంద్ర జల వనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారు. స్పీకర్‌ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరించారు అని హరీశ్‌రావు తెలిపారు.
మీరేమో విందులు చేసుకోవాలా..?
రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా..? డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైంది. అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని అర్థమైంది. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో. బడే భాయ్‌కి భయపడే, తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కనీసం స్పందించలేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారు?
మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటులో కొట్లాడినట్లు నాటకాలు ఆడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయి. మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారు? బీజేపీకి పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదని, 68 సీట్లు తక్కువ ఉన్నాయని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం రాజకీయాల కోసమే, ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏనాడో నిరూపితమైంది. కేసీఆర్ నాయకత్వంలో మొదటి తెలంగాణ శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత మా పార్టీదే అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



