Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ రాదు.. బీజేపీకి స్థానం లేదు : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.. బీజేపీకి స్థానం లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఇవాళ కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అని ఆయన తెలిపారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.. బీజేపీకి స్థానం లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఇవాళ కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అని ఆయన తెలిపారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు ప్రసంగించారు.
వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల ముఖాల్లో ఆనందం, చిరునవ్వులు చూస్తుంటే.. పెళ్లై అత్తగారింటికి వెళ్లిన ఆడబిడ్డ మళ్లీ తిరిగి అమ్మగారింటికి వచ్చినట్టు ఉంది. నిజంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నది. ఈ రెండేండ్లలో ప్రజలు ఎంతో కోల్పోయారు. అందుకే భద్రతకు, భరోసాకు చిరునామాగా ఉన్న కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. ఇవాళ భద్రత లేదు.. భరోసా లేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రెండేండ్ల పాలనలో అంత ఆగమాగం సగంసగం. ఏది నమ్మకం లేదు. ఎరువులు దొరకడం లేదు.. చెప్పులు లైన్‌లో పెట్టే కాలం వచ్చింది. ఫిబ్రవరి వస్తున్నా రైతుబంధు పడలేదు. కేసీఆర్ ఉంటే డిసెంబర్ నెలలో రైతుబంధు పడేది. గురుకుల విద్యార్థులు విషాహారంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గవర్నమెంట్ ఆస్పత్రికి పోతే నేను రాను బిడ్డో సర్కార్ దవఖానాకు అనే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద తొమ్మిదిన్నరేండ్లలో రూ. 19500 ఇచ్చిండు. రేవంత్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులను రేవంత్ ఆగం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది. కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ హయాంలో గుండె మీద చేయి వేసుకుని సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు రైతులు. ఇప్పుడు కనీసం భూములు కొనేటోడు కూడా లేడు. ఎకరం కోటికి తక్కువ లేకుండే మీ వర్ధన్నపేటలో. ఇవాళ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఆరూరి రమేశ్ తల్లిగారింటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ రాదు, బీజేపీ స్థానం లేదు.. మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తాడు అనడానికి ఈ జాయినింగ్ ఒక సంకేతంగా భావించొచ్చు. నాకు తెలిసి కాంగ్రెసోళ్లు లైన్ కడుతారు. కాంగ్రెస్ దొంగలను తీసుకునే ప్రసక్తే లేదు. అసలైన ఉద్యమకారులు కేసీఆర్ నాయకత్వంలో కలిసి పని చేద్దాం. వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురవేసేందుకు ఈ చేరిక తోడ్పాటును అందిస్తుంది. వరంగల్‌లో 12కు 12 స్థానాలు గెలివాలి.. కేసీఆర్‌కు బహునమాంగా ఇవ్వాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
మే 22, 2026

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
మే 22, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?



