త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగిండు.. కావాలంటే వీడియోలు పంపిస్తా..

Harish Rao | ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా నా పేరుంది. ఆనాడు మంత్రిగా ఉన్న నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగిండు... కావాలంటే వీడియోలు పంపిస్తా అని హ‌రీశ్‌రావు చుర‌క‌లంటించారు.

S

Telangana | Published On Apr 21, 2026, 6.17 pm IST

Harish Rao | నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగిండు.. కావాలంటే వీడియోలు పంపిస్తా..
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసింది నేనే.. పూర్తి చేసింది కూడా మేమే అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా నా పేరుంది. ఆనాడు మంత్రిగా ఉన్న నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగిండు.. కావాలంటే వీడియోలు పంపిస్తా అని హ‌రీశ్‌రావు చుర‌క‌లంటించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

వచ్చే సంవత్సరం సూపర్ ఎల్‌నినో వల్ల కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే రేవంత్ రెడ్డికి సోయొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి. ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకున్నాడు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా? కాళేశ్వరంలో ఏ తెలవని, బీ తెలవని రేవంత్ రెడ్డి.. ఎల్లంపల్లి మేమే కట్టామని అబద్ధాలు చెబుతున్నాడు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే

కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచించారంటే.. వరద ఉంటే శ్రీరాంసాగర్ నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే అని మాజీ మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఇది కాళేశ్వరం

కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కి.మీ సొరంగాలు, 1531 కి.మీ గ్రావిటీ కెనాల్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్ట్, మొత్తంగా 240 టీఎంసీల వినియోగం.. ఇది కాళేశ్వరం అని సిద్దిపేట ఎమ్మెల్యే తెలిపారు.

ఇది ముమ్మాటికీ కాళేశ్వరం లిఫ్ట్ చేసిన ఫలితమే..

లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా నిండిన చెరువులు, కూడెల్లి, హల్దీ వాగులు పొంగడం, అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిండటం కాళేశ్వరం ఫలితాలు కాదా? ఎల్లంపల్లి ప్రాజెక్టు సముద్ర మట్టానికి +148 మీటర్ల ఎత్తులో ఉంటే.. అక్కడి నుంచి మిడ్ మానేరు (+318 మీటర్లు), అనంతగిరి (+397 మీటర్లు), రంగనాయక సాగర్ (+490 మీటర్లు), మల్లన్న సాగర్ (+557 మీటర్లు), కొండపోచమ్మ సాగర్ (+618 మీటర్ల) ఎత్తుకు గోదావరి నీళ్లను మోటార్లు లేకుండా ఎలా తీసుకువస్తావు రేవంత్ రెడ్డి? ఇది ముమ్మాటికీ కాళేశ్వరం లిఫ్ట్ చేసిన ఫలితమే. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీలు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే హ‌రీశ్‌రావు ఉద్ఘాటించారు.

రాష్ట్ర మంత్రిగా నా పేరుంది..

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా నా పేరుంది. ఆనాడు మంత్రిగా ఉన్న నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగాడు. కావాలంటే వీడియోలు పంపిస్తా. కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆదేశాలతో రూ. 2052 కోట్లు ఖర్చు పెట్టి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు కట్టించి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది నేను మంత్రిగా ఉన్నప్పుడే అని హ‌రీశ్‌రావు తెలిపారు.

50 ఏళ్లయినా 10 లక్షల ఎకరాలకు నీళ్లివ్వలేదు..

1953లో ఎస్సారెస్పీ కడితే, 50 ఏళ్లయినా కాంగ్రెస్ నాయకులు 10 లక్షల ఎకరాలకు నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ వచ్చే నాటికి 6 లక్షల ఎకరాలకు నీరందేది. లోయర్ మానేరు కాలువలు బాగుచేసి, రూ. 2000 కోట్లతో కాకతీయ కాలువ ఆధునికీకరించి 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement