త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సిద్దిపేట మ‌ట్టికి ఒక మ‌హ‌త్యం ఉంది : హ‌రీశ్‌రావు

Harish Rao | సిద్దిపేట మట్టికి ఒక మహత్యం ఉంది.. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని అయితే తలపెడతామో ఆ కార్యక్రమం గమ్యాన్ని చేరుతుంది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అలా వచ్చిందే మన తెలంగాణ రాష్ట్రం ఈ నేలకు ఆ మహత్యం ఉంది. సిద్దిపేట ఆధ్యాత్మిక సేవకు గొప్ప పేరుగాంచింది అని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On May 2, 2026, 6.34 pm IST

Harish Rao | సిద్దిపేట మ‌ట్టికి ఒక మ‌హ‌త్యం ఉంది : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : సిద్దిపేట మట్టికి ఒక మహత్యం ఉంది.. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని అయితే తలపెడతామో ఆ కార్యక్రమం గమ్యాన్ని చేరుతుంది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అలా వచ్చిందే మన తెలంగాణ రాష్ట్రం ఈ నేలకు ఆ మహత్యం ఉంది. సిద్దిపేట ఆధ్యాత్మిక సేవకు గొప్ప పేరుగాంచింది అని ఆయ‌న తెలిపారు. సిద్దిపేట ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన భ‌విష్య‌త్ బ్ర‌హ్మ హ‌నుమాన్ సిద్ది మ‌హాయాగం కార్య‌క్ర‌మంలో హ‌రీశ్‌రావు పాల్గొని భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఆంజనేయ స్వామి మాలకు అంకురార్పణ పడింది మన సిద్దిపేటలోనే. హనుమాన్ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ యాగం జరగడం సంతోషంగా ఉంది. భ‌విష్యత్ బ్రహ్మ హనుమాన్ సిద్ది మహా యాగం సిద్దిపేటలో జరగడం గొప్ప విషయం. ఈ యాగంలో సుందరకాండ యజ్ఞం, 1400 సార్లు 72 గంటలు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. హనుమాన్ భక్తుల రూపంలో హనుమంతుడిని విశ్వవ్యాప్తం చేయడానికి దుర్గా ప్రసాద్ స్వామిజీ ప్రయత్నం గొప్పది. ఆయన చేస్తున్న సేవల్లో సిద్దిపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం మనందరికీ గర్వకారణం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

శత్రు నివారణకు కోసం నేడు లక్ష సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గొప్ప విశేషం. ఎక్కడైతే హనుమంతుడిని స్మరిస్తామో అక్కడ ఆధ్యాత్మిక భావనతో పాటు మనోధైర్యం, కొండంత భరోసా వికసిస్తుంది. ప్రతి సంవత్సరం విజయవాడ కృష్ణా నదిలో నిర్వహించే స్థాయిలోనే మన సిద్దిపేట కోమటి చెరువులో హనుమంతుడి తెప్పోత్సవం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. మన దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఒకరిద్దరితో మొదలైన హనుమాన్ మాలలు నేడు వేల సంఖ్యకు చేరింది. భారతదేశంలోనే అత్యధికంగా హనుమాన్ మాల ధారణ చేసే భక్తులు ఎక్కడ ఉన్నారంటే మన సిద్దిపేట లోనే ఉంటారు. ఇదంతా మన దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతోనే సాధ్యమైంది. దుర్గాప్రసాద్ స్వామీజీ గొప్పతనం గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ప్రతి ఏటా తన చేతుల మీదుగా మాల ధారణ చేసుకోవడానికి విజయవాడ, కండ్లకోయకు ఆశ్రమాలకు సిద్దిపేట భక్తులు వస్తున్నారని గ్రహించి వారికి ఇబ్బందులు కాకుండా ఈ సంవత్సరం స్వయంగా తానే సిద్దిపేటకు వచ్చి 21 రోజులు, 11 రోజుల మాల ధారణ చేశారు. వారి పుణ్య హస్తాలతోనే భక్తుల మాల విరమణ కూడా చేయనున్నట్లుగా నాకు తెలిసింది. నిజంగా మా సిద్దిపేట భక్తుల అందరి తరపున వారికి శిరస్సు వంచుతున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

హనుమత్ స్వరూపుడిగా కనిపించే దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా మాల ధారణ చేసుకోవడం మన సిద్దిపేట భక్తుల అదృష్టం. హనుమంతుడే తన భక్తుడికి మాల ధారణ చేసిన సన్నివేశాలు మన సిద్దిపేటలో ఈసారి ఆవిష్కరించారు. సిద్దిపేట మట్టికి ఒక మహత్యం ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని అయితే తలపెడతామో ఆ కార్యక్రమం గమ్యాన్ని చేరుతుంది. అలా వచ్చిందే మన తెలంగాణ రాష్ట్రం ఈ నేలకు ఆ మహత్యం ఉంది. సిద్దిపేట ఆధ్యాత్మిక సేవకు గొప్ప పేరుగాంచింది.. అమర్నాథ్, కేదార్నాథ్, అయోధ్యతో పాటు దేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో సిద్దిపేట భక్తుల సేవలు అందుతున్నాయి. అన్నదాన సత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మన మనసుతో, మన మాటలతో, మన పనులతో, మన చేతలతో హనుమంతుడిని స్మరిస్తే మన కష్టాలను దూరం చేసి మనలో మనోధైర్యాన్ని నింపుతాడు. ఇంకా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement