త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Dayaker Rao | ఆ క‌క్ష‌తోనే ఆరూరి ర‌మేశ్ పార్టీని వీడారు.. ఎర్ర‌బెల్లి కీల‌క వ్యాఖ్య‌లు

Errabelli Dayaker Rao | వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ ఆ క‌క్ష‌తోనే బీఆర్ఎస్ పార్టీ వీడారని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌డియం శ్రీహ‌రికి టికెట్ ఇచ్చార‌నే కోపంతోనే ఆరూరి ర‌మేశ్‌ను పార్టీ వీడారు.. ఇది వాస్త‌వం అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jan 28, 2026, 6.57 pm IST

Errabelli Dayaker Rao | ఆ క‌క్ష‌తోనే ఆరూరి ర‌మేశ్ పార్టీని వీడారు.. ఎర్ర‌బెల్లి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Errabelli Dayaker Rao | త్రినేత్ర‌.న్యూస్ : వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ ఆ క‌క్ష‌తోనే బీఆర్ఎస్ పార్టీ వీడారని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌డియం శ్రీహ‌రికి టికెట్ ఇచ్చార‌నే కోపంతోనే ఆరూరి ర‌మేశ్‌ను పార్టీ వీడారు.. ఇది వాస్త‌వం అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఆరూరి ర‌మేశ్ బీజేపీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్న సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడారు.

ఆరూరి ర‌మేశ్ మ‌ళ్లీ సొంత గూటికి చేరుకోవ‌డం వ‌ల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం జ‌రుగుతుంది. ఆరూరి వెళ్లిన త‌ర్వాత కూడా అస‌లైన కార్య‌క‌ర్త‌లు పార్టీలోనే ఉన్నారు. ఐనోలు, వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లాల్లో గ్రామ స‌ర్పంచ్‌ల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలిచింది. ర‌మేశ్ ఉంటే ఇంకా వ‌న్‌సైడ్ గెలిచేటోళ్లం. అంద‌ర్నీ క‌లుపుకుపోవాల‌ని కోరుతున్నాను. క‌ష్ట‌కాలంలో ఉన్న‌వారిని కాపాడుకుంటూ అంద‌ర్నీ కాపాడుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. క‌డియం శ్రీహ‌రి చేయ‌బ‌ట్టే ఆరూరి ర‌మేశ్ పార్టీని వీడి పోయిండు.. క‌డియంకు టికెట్ ఇవ్వ‌డంతో.. అలాంటి మోస‌గాడికి టికెట్ ఇచ్చార‌నే బాధ‌తోనే పార్టీ నుంచి పోయిండు అది వాస్తం. కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌రావు మీద కోపం లేదు. వాళ్లు దేవుళ్లు అని ఆరూరి ర‌మేశ్ చెప్పేటోడు. వేరే కానే కాదు అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

వ‌ర్ధ‌న‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావొద్దు. మున్సిపాలిటీ ఎన్నిక‌లు, జ‌డ్పీ ఎన్నిక‌లు, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ గెలవాలి. అప్పుడు మ‌న‌కు రమేశ్ అవ‌స‌రం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ, మ‌ళ్లీ ఆరూరి బీఆర్ఎస్‌లో చేరారు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేద్దాం. కార్య‌క‌ర్త‌లు స‌మిష్టిగా ప‌ని చేస్తే వంద శాతం విజ‌యం సాధిస్తాం అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement