Onion Prices | ఘాటెక్కిన ఉల్లి.. తల్లడిల్లుతున్న గృహిణి
Onion Prices | హైదరాబాద్ నగరంలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. దీంతో గృహిణులు తల్లడిల్లిపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు నగరంలో కిలో ఉల్లి ధర రూ. 20 ఉండేది. గత నెలలో రూ. 35 వరకు ఉండగా.. ప్రస్తుతం ఆ ధరలు రెండింతలు అయ్యాయి.
Onion Prices | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. దీంతో గృహిణులు తల్లడిల్లిపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు నగరంలో కిలో ఉల్లి ధర రూ. 20 ఉండేది. గత నెలలో రూ. 35 వరకు ఉండగా.. ప్రస్తుతం ఆ ధరలు రెండింతలు అయ్యాయి. తాజాగా మార్కెట్‌లో ఉల్లి కొనాలంటే కిలోకు రూ. 60పైనే చెల్లించాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉల్లి ధర రూ. 100కు చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్‌నినో కారణంగా ఉల్లి పంట దిగుబడి గణనీయంగా తగ్గడమే.
సోమవారం 11,870 క్వింటాళ్లు మాత్రమే దిగుమతి
నగరంలో ఉల్లికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఉల్లిని భారీగా కొనుగోలు చేస్తుంటారు. దీంతో గతంలో రోజుకు 20 నుంచి 25 వేల క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుమతి అయ్యేది. కానీ ఆగస్టు 31న మాత్రం కేవలం 11870 క్వింటాళ్లు మాత్రమే దిగుమతి అయింది.
కిలో ఉల్లి ధర రూ. 60
హైదరాబాద్ నగరానికి ప్రధానంగా మహారాష్ట్రలోని నాసిక్ నుంచి అధికంగా ఉల్లి వస్తుంది. అక్కడ వర్షాభావ పరిస్థితుల కారణంగా.. ఖరీఫ్ పంట సాగు ఆలస్యమైంది. పాత ఉల్లి ఉంటే.. అది అకాల వర్షాలకు తడిసిపోయి దెబ్బతిన్నది. దీంతో సరఫరా తగ్గిపోయింది. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చేందుకు ఆలస్యం కావడం, పాత నిల్వలు అయిపోవడంతో.. హోల్ సేల్ మార్కెట్‌లోకి వచ్చే ఉల్లి పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లికి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. నాణ్యమైన ఉల్లి ధర రూ. 60(కిలో) పలుకుతోంది. రైతుబజార్లలో రూ.35-40 వరకు ఉండగా మహబూబ్‌మాన్షన్, బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లలో క్వింటాల్ రూ.3,200 నుంచి రూ.4,000 వరకు ఉంది.
సంబంధిత వార్తలు

Harish Rao | సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే.. భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నడు : హరీశ్‌రావు
సెప్టెంబర్ 4, 2026

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
సెప్టెంబర్ 4, 2026

DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ
- ●Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు
- ●Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
- ●Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..

DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు



