Vinod Kumar | ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌ను సాకుగా చూపకండి సీఎం రేవంత్ : మాజీ ఎంపీ వినోద్
Vinod Kumar | ఎన్డీఎస్ఏ రిపోర్టును సాకుగా చూపి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టకండి సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని సీఎం, మంత్రులు ప్రమాణం చేస్తారు.. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సీఎం ద్వేషం పెంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
Vinod Kumar | త్రినేత్ర.న్యూస్ : ఎన్డీఎస్ఏ రిపోర్టును సాకుగా చూపి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టకండి సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తామని సీఎం, మంత్రులు ప్రమాణం చేస్తారు.. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సీఎం ద్వేషం పెంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఎల్ నినో ప్రభావంపై అంతటా చర్చ జరుగుతోంది. 2024 డిసెంబర్ 11 నాడు ఇదే వేదిక నుంచి డ్యామ్ సేఫ్టీ యాక్ట్ గురించీ చెప్పా. అది నియంత్రించే సంస్థకాదు సలహాలు ఇచ్చే సంస్థ. 16 నెలల క్రితం ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. దాంట్లో యాజమాని రాష్ట్రప్రభుత్వమే అని చెప్పింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మకై ఎన్డీఎస్ఏ రిపోర్టును తయారు చేశాయి. నీళ్లు అనేది రాష్ట్రం సబ్జెక్ట్. కేవలం ద్వేష పూరిత రాజకీయాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్టును సాకుగా చూపుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు అమలు చేయడం తప్పనిసరి కాదు అని వినోద్ కుమార్ తెలిపారు.
ఇక్కడ ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు?
మొత్తం పోలవరం డ్యామేజ్ 960 .15 కోట్లు. దాదాపు పదివేల కోట్లు కేంద్రం రిపేర్‌కు పోలవరం అథారిటీకి ఇచ్చింది. ఇక్కడ ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? ఎన్డీఎస్ఏకు 20 మంది సిబ్బంది కూడా లేరు. బీజేపీ ప్రభుత్వం చైర్మన్‌ను తప్ప సభ్యులను ఇంకా నియమించలేదు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో ఉంటే ఎన్డీఎస్ఏ వ్యవహారంపై కేంద్రంతో మాట్లాడుతారు అనుకున్నా. కానీ అలా జరగలేదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
మొహం కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండవు
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోతే హైదరాబాద్‌లో మొహం కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండవు. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమని మొత్తుకున్నాం. ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేద్దామన్న నీళ్లు లేవు అని ఆయన తెలిపారు.
చంద్రబాబు, జగన్.. పోలవరంపై విమర్శలు చేసుకోలేదు
చంద్రబాబుకు జగన్‌కు పాముకు ముంగీసకు ఉన్న పగ ఉన్నా.. పోలవరంపై విమర్శలు చేసుకోలేదు. పదిసార్లు పోలవరం నిర్మాణంలో తప్పిదాలు జరిగినా చంద్రబాబు జగన్‌లు ఒకరికొకరు తప్పుపట్టుకోలేదు. రేవంత్ రెడ్డి పోలవరంపై అక్కడి నేతలు ప్రదర్శిస్తున్న విజ్ఞతను ఇక్కడ ప్రదర్శించాలి అని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అనివార్యం..
ఎన్నికలకు చివరి సంవత్సరంలో రాజకీయాలు చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంతోషం.. ఆ మాటకు కట్టుబడి ఉండి ద్వేష రహిత పాలన చేయాలి. కాళేశ్వరం కూలిపోయిందని ఎన్ని రోజులు మాట్లాడతారు. రైతులకు అన్ని విషయాలు తెలిసి పోయాయి.ఇక మీ అబద్దాలు నమ్మరు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏను బూచీగా చూపడం మాని మేడిగడ్డ కన్నెపల్లి నుంచి ఎపుడు నీళ్లు ఉంటె అపుడు లిఫ్ట్ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అనివార్యం. కేసీఆర్ అన్నీ ఆలోచించే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. మాకు రాజకీయప్రయోజనాలు ముఖ్యం కాదు.. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. రేవంత్ రెడ్డి తాను చేసిన ప్రమాణాన్ని పాలనలో పాటించాలి అని వినోద్ కుమార్ సూచించారు.
సంబంధిత వార్తలు

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ ఇదే!
జులై 15, 2026

RS Praveen Kumar | రేవంత్‌కు రెండు చోట్ల ఓటు.. ఏడాది పాటు జైలుకు పంపాల్సిందే : ఆర్ఎస్పీ
జులై 15, 2026

MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్
జులై 15, 2026
తాజావార్తలు
- ●Mouni Roy | ఆపండి..! పాపరాజీలపై నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆగ్రహం..!
- ●Sonam Wangchuk | రెండు రోజుల్లో చనిపోవచ్చు.. వాంగ్చుక్ను రక్షించండి.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
- ●Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ 'ఫ్యూచర్ సిటీ' మాస్టర్ ప్లాన్ ఇదే!
- ●RS Praveen Kumar | రేవంత్‌కు రెండు చోట్ల ఓటు.. ఏడాది పాటు జైలుకు పంపాల్సిందే : ఆర్ఎస్పీ
- ●LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి
- ●MP Renuka Chowdhury | బీఆర్ఎస్ పుంజుకుంటుంది.. ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు వైరల్

Mouni Roy | ఆపండి..! పాపరాజీలపై నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆగ్రహం..!

Sonam Wangchuk | రెండు రోజుల్లో చనిపోవచ్చు.. వాంగ్చుక్ను రక్షించండి.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

Telangana AWS Data Centre | అమెజాన్‌కు రూ.లక్ష కోట్ల టార్గెట్.. సీఎం రేవంత్ 'ఫ్యూచర్ సిటీ' మాస్టర్ ప్లాన్ ఇదే!

RS Praveen Kumar | రేవంత్‌కు రెండు చోట్ల ఓటు.. ఏడాది పాటు జైలుకు పంపాల్సిందే : ఆర్ఎస్పీ



