Edupayala Jatara | మహాశివరాత్రి జాతరకు ముస్తాబైన ఏడుపాయల..
Edupayala Jatara | రాష్ట్రంలో మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల వన దుర్గాదేవి జాతర (Edupayala Jatara) ప్రసిద్ధికెక్కింది. మహాశివరాత్రి (Maha Shivarathri) సందర్భంగా మూడు రోజులపాటు జరిగే ఈ జాతరకు సుముహూర్తం ఆసన్నమైంది.
Edupayala Jatara | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల వన దుర్గాదేవి జాతర (Edupayala Jatara) ప్రసిద్ధికెక్కింది. మహాశివరాత్రి (Maha Shivarathri) సందర్భంగా మూడు రోజులపాటు జరిగే ఈ జాతరకు సుముహూర్తం ఆసన్నమైంది. ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. జాతరలో తొలిరోజు మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని భక్తులు మంజీరా నదీ (Manjeera River) పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఆ తర్వాత వన దుర్గమ్మను (Vanadurga Bhavani) దర్శించుకుంటారు.
రెండో రోజైన ఫిబ్రవరి 16న జాతరలో ముఖ్య ఘట్టమైన బండ్ల ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఏడుపాయల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువస్తారు. వాటిని ఆలయం చుట్టూ ప్రదర్శనగా తిప్పుతూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఫిబ్రవరి 17న జరిగే రథోత్సవంతో జాతర ముగుస్తుంది.
జాతరకు సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు వస్తారు.

ఆలయ విశిష్టత
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద గోదావరి ఉపనది అయిన మంజీరా ఏడు పాయలుగా విడిపోయిన ప్రదేశం మధ్యలో వన దుర్గ ఆలయం వెలసింది. అందుకే ఈ క్షేత్రానికి ఏడుపాయల అనే పేరు వచ్చింది. ఏడు పాయలుగా విడిపోయిన మంజీరా నది.. అమ్మవారి పాదాలను తాకుతూ గుడిని దాటిన తర్వాత మళ్లీ కలిస్తుంది. పేరుకు తగినట్లే ప్రకృతి సౌందర్యం మధ్య ఈ ఆలయం వెలసింది.
ఈ ఆలయానికి మహాభారత కాలం నాటి పురాణ గాథలతో ముడిపడిన చారిత్రక నేపథ్యం ఉంది. వ్యాస మహాభారతం ప్రకారం.. పాండవుల వనవాసానికి వెళ్లినప్పుడు అర్జునుడు కౌరవ సేనపై విజయం సాధించడానికి దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు

Raashi Khanna | సింగర్‌గా మారిన హీరోయిన్ రాశీఖన్నా – శివుడిపై భక్తి పాట – నెటిజన్ల ప్రశంసలు
ఫిబ్రవరి 15, 2026

Maha Shivaratri | శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ.. ఎములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం
ఫిబ్రవరి 15, 2026

TGSRTC | మహా శివరాత్రి.. 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సులు
ఫిబ్రవరి 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



